AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!

Sri Rama Navami Marriage Solution: వివాహం ఆలస్యం అవుతున్న యువతీ యువకులకు శ్రీరామనవమి ఒక ప్రత్యేక పరిష్కారాన్ని అందిస్తుంది. జాతక దోషాలైన కుజ, శుక్ర, కాలసర్ప దోషాలను తొలగించే శక్తి రామచంద్రమూర్తికి ఉంది. శ్రీరాములవారి కళ్యాణం అనంతరం తలంబ్రాలను శిరస్సుపై ధరించడం ద్వారా వివాహయోగం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
Srirama Navami
Rajashekher G
|

Updated on: Mar 24, 2026 | 12:12 AM

Share

హిందూ ధర్మంలో శ్రీరామనవమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శ్రీరామనవమి సందర్భంగా దేశ వ్యాప్తంగా పల్లెల నుంచి నగరాల వరకు సీతారాముల కళ్యాణోత్సవాలతో పండగ వాతావరణం నెలకొంటుంది. సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు కొన్ని పనులు చేయడం వల్ల కోరిన కోరికలు తీరడంతోపాటు శుభ ఫలితాలు వస్తాయి. శ్రీరామనవమి పర్వదినం పెళ్లికాని యువతీ యువకులకు ఆశలు చిగురింపజేసే ఒక అద్భుత పరిష్కారాన్ని అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొందరి జాతకాలలో కుజ దోషం, శుక్ర దోషం, కాలసర్ప దోషం వంటివి వివాహాలు ఆలస్యం కావడానికి కారణం కావచ్చు. అయితే, ఈ దోషాలను తొలగించే శక్తి దైవానికే ఉంది, ఆ దైవం సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి.

ప్రాచీన సంప్రదాయాల ప్రకారం, మీన చైత్రం పేరుతో రాములవారి కళ్యాణ తిథి అయిన దశమి, నవమి తిథుల కంటే ముందు గృహాలలో వివాహాలు జరిగేవి కావు. అప్పట్లో మీన చైత్రంలో ఉపనయనాలు మాత్రమే నిర్వహించి, “ముండనం నతు మండనం” అనే ప్రమాణాన్ని పాటించేవారు. శ్రీరాములవారి కళ్యాణం జరిగిన తర్వాత, ఆ పవిత్రమైన తలంబ్రాలను ఇంటిలో వివాహం కానటువంటి యువతీ యువకుల శిరస్సు పైన వేసినట్లయితే, వారికి వివాహయోగం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ ఆచారాన్ని పాటిస్తూ, శ్రీరాముని అనుగ్రహంతో సత్వర వివాహ ప్రాప్తిని పొందవచ్చని ప్రగాఢ విశ్వాసం. ఇంకేముంది మీరే ఇలాగే చేసి వివాహ యోగం పొందండి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..