AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగ్నీషియం, ఐరన్, జింక్‌తో కూడిన ఈ విత్తనాలు పోషకాల నిధి.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

వేసవిలో లేదా సాధారణ రోజుల్లో పుచ్చకాయ తినేటప్పుడు చాలామంది చేసే మొదటి పని అందులో ఉన్న విత్తనాలను ఏరి పారేయడం. కానీ, ఈ విత్తనాలు శరీరానికి ఎంతో మేలు చేసే పోషకాల గని అని మీకు తెలుసా? పోషకాహార నిపుణుల ప్రకారం, పుచ్చకాయ విత్తనాల్లో మెగ్నీషియం, ఐరన్, జింక్, గుండెకు మేలు చేసే కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.

Jyothi Gadda
|

Updated on: Oct 17, 2026 | 7:13 PM

Share
గుండె ఆరోగ్యానికి మేలు: పుచ్చకాయ విత్తనాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచడానికి, గుండె పనితీరును మెరుగుపరచడానికి దోహదపడుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తాయి.

1 / 5
రోగనిరోధక శక్తి పెరుగుదల: ఈ విత్తనాలలో ఉండే జింక్ మన శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జింక్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కణాల పునరుత్పత్తికి, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.

2 / 5
రక్తహీనత నివారణ: రక్తహీనత (అనీమియా) సమస్యతో బాధపడేవారికి పుచ్చకాయ విత్తనాలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. వీటిలోని ఐరన్ కంటెంట్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, శరీరమంతటా ఆక్సిజన్ సరఫరా వేగవంతమయ్యేలా చేస్తుంది. వీటిలో లభించే మెగ్నీషియం, బి-విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరంలో శక్తి ఉత్పత్తికి, జీవక్రియల వేగాన్ని పెంచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.

3 / 5
పుచ్చకాయ విత్తనాలను ఆహారంలో ఎలా తీసుకోవాలి?: పుచ్చకాయ విత్తనాలను నేరుగా తినడం కంటే, వాటిని ఎండబెట్టి, లైట్‌గా వేయించి కొద్దిగా ఉప్పు లేదా మసాలా చల్లుకుని హెల్తీ స్నాక్‌లా తీసుకోవచ్చు. అంతేకాకుండా, వీటిని పొడి చేసి సూప్‌లు, సలాడ్‌లు, పెరుగు లేదా స్మూతీస్‌పై చల్లుకుని తింటే మంచి రుచితో పాటు పూర్తి పోషకాలు లభిస్తాయి.

4 / 5
వారానికి కొన్నిసార్లు పుచ్చకాయ విత్తనాలను పరిమిత పరిమాణంలో మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలను సులభంగా పొందవచ్చు. ఇకపై పుచ్చకాయ తినేటప్పుడు విత్తనాలను పారేయకుండా మీ ఆరోగ్యానికి ఉపయోగించుకోండి.

5 / 5
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే