AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీల్స్ కలిపిన ప్రేమ జంట! 30 ఏళ్ల యువతితో 75 ఏళ్ల వృద్ధుడి నిశ్చితార్థం… త్వరలోనే పెళ్లి!

ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అనే మాటను తరచూ వింటూనే ఉంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో జరిగిన ఒక ఉదంతం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏకంగా 45 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉన్న ఓ జంట నిశ్చితార్థం చేసుకుని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రీల్స్ కలిపిన ప్రేమ జంట! 30 ఏళ్ల యువతితో 75 ఏళ్ల వృద్ధుడి నిశ్చితార్థం... త్వరలోనే పెళ్లి!
Age Difference In Love
Jyothi Gadda
|

Updated on: Oct 17, 2026 | 7:27 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో 45 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉన్న ఒక విచిత్రమైన ప్రేమకథ సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఔరయ్యా జిల్లా సహార్ బ్లాక్‌లోని అరియారీ గ్రామానికి చెందిన 75 ఏళ్ల రామ్‌సుగర్‌కు ఏడేళ్ల క్రితమే భార్య దూరమైంది. ఆయన కుమార్తె రాధ యూట్యూబ్‌లో రిల్స్, వీడియోలు చేస్తూ ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల రాణి రాజ్‌పుత్ కూడా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తోంది. వీడియోలు చేసే క్రమంలో రాణి గత రెండేళ్లుగా రామ్‌సుగర్ ఇంటికి క్రమం తప్పకుండా వస్తూ ఉండేది.

వీడియో షూటింగ్‌లు, తరచూ కలిసే అవకాశాలు రావడంతో రామ్‌సుగర్, రాణీల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం అడ్డుకాలేకపోయింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, ఇరుపక్షాల అంగీకారంతో వీరిద్దరు ఇటీవల ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. దేవీ నవరాత్రుల అనంతరం వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ విచిత్రమైన జంటపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ప్రేమకు హద్దులు లేవని నిరూపించారు అని కామెంట్లు చేస్తుంటే, మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో పబ్లిసిటీ, వ్యూస్ కోసమే ఇలా చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాణి రాజ్‌పుత్, వయస్సు వ్యత్యాసం తమ బంధానికి ఎంతమాత్రం సమస్య కాదని, ఇద్దరి ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. రామ్‌సుగర్ కూడా పరస్పర అంగీకారంతోనే ఈ వివాహానికి సిద్ధమైనట్లు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us