AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు.. తీరా పరిశీలించి చూడగా

సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేరాలని, మొక్కలు మొక్కి.. విశ్వాసంతో హుండీలో కానుకగా నగదు సమర్పిస్తారు. అయితే ఈసారి లెక్కింపులో నిజమైన కరెన్సీ మధ్యలో చిల్డ్రన్స్ బ్యాంక్ పేరుతో ఉన్న నకిలీ నోట్లు బయటపడటం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఆ వివరాలు..

Telangana: ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు.. తీరా పరిశీలించి చూడగా
Temple Hundi Collection
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Mar 23, 2026 | 10:04 PM

Share

హైదరాబాద్ నగరంలోని ఫేమస్ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో భక్తి పేరుతో చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపుతోంది. దేవాలయ హుండీ లెక్కింపు సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ విషయం భక్తులను ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురిచేసింది. సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేరాలని, మొక్కలు మొక్కి.. విశ్వాసంతో హుండీలో కానుకగా నగదు సమర్పిస్తారు. అయితే ఈసారి లెక్కింపులో నిజమైన కరెన్సీ మధ్యలో చిల్డ్రన్స్ బ్యాంక్ పేరుతో ఉన్న నకిలీ నోట్లు బయటపడటం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. 100, 200, 500 రూపాయల విలువలతో ఉన్న ఈ నకిలీ నోట్లు అసలు కరెన్సీతో కలిపి వేయబడినట్లు గుర్తించారు.

ఈ ఘటన భక్తి, విశ్వాసాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పవిత్ర స్థలాల్లో కూడా ఇలాంటి మోసపూరిత చర్యలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అనిపిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ముందే నకిలీ నోట్లు వేయడం కేవలం చట్ట విరుద్ధమే కాకుండా నైతికంగా కూడా తప్పిదమని వారు అంటున్నారు. ఇక ఆలయ అధికారులు ఈ ఘటనపై స్పందిస్తూ, భవిష్యత్తులో హుండీ లెక్కింపులో మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నకిలీ నోట్లు గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు వినియోగించడం, భద్రతా చర్యలు పెంచడం వంటి చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారు.

Follow Us
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
దుర్వాసన పోయి కిచెన్ సింక్ అద్దంలా మెరవాలా?.. అదిరిపోయే ట్రిక్
దుర్వాసన పోయి కిచెన్ సింక్ అద్దంలా మెరవాలా?.. అదిరిపోయే ట్రిక్
రెండేళ్లు కెరీర్‌లో చాలా కోల్పోయా.. ఆ ఇద్దరి వల్లే..
రెండేళ్లు కెరీర్‌లో చాలా కోల్పోయా.. ఆ ఇద్దరి వల్లే..
గోధుమ దోసె టమాటా చట్నీ.. నిమిషాల్లోనే అదిరిపోయే టేస్ట్!
గోధుమ దోసె టమాటా చట్నీ.. నిమిషాల్లోనే అదిరిపోయే టేస్ట్!