సాధారణంగా పప్పాయి (బొప్పాయి) పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొందరు వ్యక్తులు దీనిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
బొప్పాయిలో ముఖ్యంగా పచ్చి లేదా అరపండులో లాటెక్స్ పాపైన్ ఉంటాయి. ఇవి గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. దీనివల్ల గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే గర్భిణీలు దూరంగా ఉండాలి.
బొప్పాయిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-సి అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సలేట్ స్థాయిలు పెరిగి, కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి లేదా ఉన్న రాళ్లు పెద్దవి కావడానికి కారణం కావచ్చు.
మధుమేహం ఉన్నవారికి బొప్పాయి మంచిదే అయినప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయిలు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నవారు దీనిని ఖాళీ కడుపుతో తింటే షుగర్ లెవల్స్ ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది.
అలర్జీ సమస్యలు: బొప్పాయిలోని పాపైన్ ఎంజైమ్ కొందరికి శ్వాసకోశ ఇబ్బందులను లేదా చర్మంపై దద్దుర్లను కలిగిస్తుంది. మీకు పండ్ల అలర్జీ ఉంటే దీనిని ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకండి.
గుండె జబ్బులు ఉన్నవారు: గుండె వేగాన్ని నియంత్రించే మందులు వాడుతున్న వారు బొప్పాయిని అతిగా తీసుకోకూడదు. ఇది రక్త ప్రసరణపై స్వల్ప ప్రభావం చూపుతుంది.
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఖాలీ కడుపుతో బొప్పాయి తీసుకోకూడదు, ఇందులో ఆక్సలేట్ ఉంటుంది. బొప్పాయిలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్ల సమస్యను పెంచుతుంది.
బొప్పాయి రుచికరమైన పండు, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తరచూ తినడం వల్ల ఆకలి పెరుగుతుంది, శరీరంలో శక్తిని పెంచుతుంది. కానీ, పై సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో బొప్పాయి తినకూడదని నిపుణులు సూచన.