AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూసేసరికి ఊహించని సీన్.. వీడియో వైరల్..

మీరు ఇంటికి తాళం వేసి అలా బయటికి వెళ్లారో లేదో.. ఇలా గంట వ్యవధిలోనే పని కానిచ్చేశారు.. అల్మరాలు పగలగొట్టారు.. కష్టపడి దాచుకున్న నగదు, నగలను ఊడ్చేశారు. అత్తాపూర్ జలాల్ బాబా నగర్‌లో ఓ వ్యాపారి ఇంట్లో కేవలం గంటలోనే 20 లక్షల నగదు, బంగారం మాయమయ్యాయి.

Telangana: ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి చూసేసరికి ఊహించని సీన్.. వీడియో వైరల్..
Robbery In Attapur
Sravan Kumar B
| Edited By: |

Updated on: Mar 23, 2026 | 10:06 PM

Share

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్ బాబా నగర్‌లో ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు, కేవలం గంట వ్యవధిలోనే భారీ స్కెచ్ వేసి రూ. 20 లక్షల నగదుతో పాటు భారీగా బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. స్థానిక వ్యాపారి ఫిరోజ్ తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఐదుగురు దుండగులు బైకులపై వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టారు. లోపలికి ప్రవేశించిన దుండగులు బెడ్‌రూమ్ అల్మరాను ధ్వంసం చేసి, అందులో ఉన్న నగదు, నగలను దోచుకున్నారు. యజమాని తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల కావడంతో షాక్‌కు గురై డయల్ 100కు సమాచారం అందించారు.

పోలీసుల దర్యాప్తు – తెలిసిన వారేనా?

ఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదుగురు దుండగులు బైకులపై రావడం, ఒకడు టవల్‌తో ముఖం దాచుకుని లోపలికి వెళ్లడం రికార్డయ్యింది. ఫిరోజ్ కుటుంబం బయటికి వెళ్లిన విషయాన్ని గమనించి, కేవలం గంటలోనే దొంగతనం ముగించడాన్ని బట్టి ఇది తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

సమ్మర్.. దొంగలకు సీజన్

వేసవి సెలవుల దృష్ట్యా చాలా కుటుంబాలు వెకేషన్లకు, ఊళ్లకు వెళ్తుంటాయి. ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ టీమ్స్‌ని రంగంలోకి దించి దొంగల వేట మొదలుపెట్టారు.

Follow Us
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
దుర్వాసన పోయి కిచెన్ సింక్ అద్దంలా మెరవాలా?.. అదిరిపోయే ట్రిక్
దుర్వాసన పోయి కిచెన్ సింక్ అద్దంలా మెరవాలా?.. అదిరిపోయే ట్రిక్
రెండేళ్లు కెరీర్‌లో చాలా కోల్పోయా.. ఆ ఇద్దరి వల్లే..
రెండేళ్లు కెరీర్‌లో చాలా కోల్పోయా.. ఆ ఇద్దరి వల్లే..
గోధుమ దోసె టమాటా చట్నీ.. నిమిషాల్లోనే అదిరిపోయే టేస్ట్!
గోధుమ దోసె టమాటా చట్నీ.. నిమిషాల్లోనే అదిరిపోయే టేస్ట్!