క్రిస్పీ దోశల కోసం ఒక గ్లాసు మినపప్పుకు మూడు గ్లాసుల బియ్యం సరైన నిష్పత్తి. దోశ పిండిలో మెంతులు, అటుకులు లేదా శనగపప్పు వేయడం వల్ల రుచి, రంగు, క్రిస్పీనెస్ పెరుగుతాయి. శనగపప్పు ముఖ్యంగా దోశకు బంగారు రంగును ఇస్తుంది. వీటిని మినపప్పుతో పాటు నానబెట్టాలి.