AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి

Colombia Military Plane Crash: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 110 మంది సైనికులతో వెళ్తున్న ఒక విమానం ప్యూర్టో లెగుయిజామో సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో వంద మంది వరకు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
Colombia Military Plane Crash
Rajashekher G
|

Updated on: Mar 23, 2026 | 11:23 PM

Share

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. 110 మంది సైనికులతో వెళ్తున్న ఒక విమానం ప్యూర్టో లెగుయిజామో సమీపంలో టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. సి-130 హెర్క్యులస్ విమానం పెరూ సరిహద్దు సమీపంలో ప్రయాణిస్తోంది. విమానంలో సైనిక బలగాలను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణం, మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇప్పటివరకు, గాయపడిన 20 మంది సైనికులను రక్షించారు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాదానికి గల కారణం ఇంకా నిర్ధారించబడలేదని అధికారులు తెలిపారు. 110 మంది సైనికులతో ప్రయాణిస్తున్న విమానం నగరానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రమాదంలో చాలా మంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ తెలిపారు.

అమెరికా రక్షణ పరికరాల తయారీ సంస్థ అయిన లాక్‌హీడ్ మార్టిన్ ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. ఈ విషాద ప్రమాదంలో ఎవరూ మరణించి ఉండరని ఆశిస్తున్నట్లు అధ్యక్షుడు గుస్తావో పెట్రో అన్నారు. సైనిక ఆధునీకరణలో జాప్యానికి బాధ్యులైన అధికారులను జవాబుదారీగా చేస్తామని, ఇకపై ఎలాంటి జాప్యాన్ని సహించబోమని కూడా ఆయన పేర్కొన్నారు.

Follow Us
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు