AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP HC Recruitment: ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి

AP High Court jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు తేదీతోపాటు నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

AP HC Recruitment: ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
Ap High Court Jobs
Rajashekher G
|

Updated on: Mar 24, 2026 | 12:02 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇది శుభవార్త. రాష్ట్ర హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 అసిస్టెంట్స్, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ ఖాళీలతోపాటు తదితర పోస్టులను రెగ్యూలర్ ప్రాతిపాదికన భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 300

ఖాళీల వివరాలు

  • సీనియర్ సిస్టమ్ ఆఫీసర్: 01
  • సెక్షన్ ఆఫీసర్స్: 05
  • కంప్యూటర్ ఆపరేటర్: 31
  • అసిస్టెంట్ లైబ్రేరియన్: 01
  • లైబ్రేరియన్ గ్రేడ్-II: 01
  • యూడీ స్టెనో గ్రాఫర్: 07
  • అసిస్టెంట్: 78
  • ఎగ్జామినర్: 27
  • టైపిస్ట్: 44
  • కాపీయిస్ట్: 34
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: 50
  • స్టెనో గ్రాఫర్: 01
  • ఆఫీస్ సబార్డినేట్: 20

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి/డిగ్రీ/బీటెక్/లా డిగ్రీ/ఎమ్మెల్సీలో ఉత్తీర్ణతతోపాటు టైపింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 20,000 నుంచి రూ. 1,47,760.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ), కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

వయో పరిమితి: 01.01.2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు ప్రారంభం: 30.03.2026 దరఖాస్తు చివరి తేదీ: 19.04.2026.

ఏపీ హైకోర్టు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://aphc.gov.in/docs/notification_1774248554_0.pdf

Follow Us
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
రంభ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరోయిన్
అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా
అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
ఇదేదో కాస్ట్లీహోటల్ అనుకునేరు..రూ.1100కే డ్యూప్లెక్స్ లగ్జరీ రూమ్
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీరు కోటీశ్వరులే.. మీ చేతిలో ఉందా మరి
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
హిప్పోలు ఒక్క రాత్రిలో ఎంత గడ్డి మేస్తాయో తెలుసా..?
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
మీరు చేసే ఈ చిన్న తప్పుల వల్లే ఫ్రిజ్ కంప్రెసర్ పేలుతుంది..
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె
ఇలాంటి వారిని మీ ఇంటి గుమ్మం దాటనివ్వొద్దు.. చాణక్యుడి షాకింగ్ హె
ఆ హీరోనే ప్రపంచంలో బెస్ట్ డ్యాన్సర్.. హీరోయిన్ రంభ..
ఆ హీరోనే ప్రపంచంలో బెస్ట్ డ్యాన్సర్.. హీరోయిన్ రంభ..
'ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే'
'ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే'