AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే సక్సెస్..

తమిళనాడులో సినిమా హాల్ అనేది కేవలం వినోద కేంద్రం కాదు. అగ్రనటులందరికీ అదొక రాజకీయ పాఠశాల. అన్నాదురై కలం నుంచి, కరుణానిధి మాటల నుంచి, ఎంజీఆర్ కత్తి యుద్ధాల నుంచి తమిళ రాజకీయాల్లో సినిమా ఒక అంతర్భాగమైపోయింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్ర రాజకీయ చరిత్రను సినిమా తారలే శాసించడం అక్కడి ప్రత్యేకత. తమిళనాడులో సినిమా నటులకు పార్టీ పెట్టడం అనేది ఒక 'గ్రాండ్ రిలీజ్' లాంటిది. కానీ అది 'బ్లాక్ బస్టర్' అవ్వాలంటే కేవలం గ్లామర్ సరిపోదు. బలమైన 'స్క్రిప్ట్', సమర్థమైన 'డైరెక్షన్' ఉండాలి. మరి.. వచ్చే నెల జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు.. ఈ సినీ-రాజకీయ పోరులో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయా?

సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే సక్సెస్..
Tamil Nadu politics actors
Jyothi Gadda
|

Updated on: Mar 23, 2026 | 10:07 PM

Share

తమిళనాట పార్టీ పెట్టడం ఒక ఎత్తయితే.. దాన్ని ‘అధికార పీఠం’ వరకు తీసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదు. బట్.. దీనికి పునాది వేసింది ముగ్గురు వ్యక్తులు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది అన్నాదురై అండ్ కరుణానిధి. వీరు సినిమాలను తమ ద్రావిడ భావజాల ప్రచారానికి ఆయుధాలుగా వాడుకున్నారు. సామాజిక మార్పును సినిమాల ద్వారా చూపించి ప్రజల మెదళ్లలోకి చొచ్చుకుపోయారు. ఆ రోజుల్లో దేశమంతా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. అలాంటి సమయంలో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దించేసిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ.. డీఎంకే. అలా స్వతంత్ర భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అన్నాదురై. రాజకీయాల్లోకి రాకముందు రంగస్థల నాటక రచయితగా ఉన్నారు అన్నాదురై. ఇక ఆయన శిష్యుడిగా సినీ రచనలు చేస్తూ పదునైన సంభాషణలతో ప్రజల్ని ఆకట్టుకున్న నాయకుడు కరుణానిధి. అందుకే, అన్నాదురై చనిపోయినప్పుడు మరో ఆలోచనకు తావులేకుండా కరుణానిధిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది ఆ పార్టీ. ఈ ఇద్దరి కంటే ఎక్కువ ప్రభావం చూసిన స్టార్.. ఎం.జి. రామచంద్రన్. గేమ్ ఛేంజర్, ట్రెండ్ సెట్టర్ అంటుంటారే.. ఆ పదాలు ఎంజీఆర్‌కు సరిగ్గా సరిపోతాయి. సినిమాల్లో ‘పేదల పెన్నిధి’గా ముద్ర వేయించుకుని, అన్నాడీఎంకే స్థాపించి 1977లో ముఖ్యమంత్రి అయ్యారు. చనిపోయే వరకు ఆయనే రాజు. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, ‘మధ్యాహ్న భోజన పథకం’ వంటి సంక్షేమ పథకాలతో ఇప్పటికీ జనం గుండెల్లో తిష్ట వేశారు. పార్టీ ఏదైనా సరే.....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
దుర్వాసన పోయి కిచెన్ సింక్ అద్దంలా మెరవాలా?.. అదిరిపోయే ట్రిక్
దుర్వాసన పోయి కిచెన్ సింక్ అద్దంలా మెరవాలా?.. అదిరిపోయే ట్రిక్