AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Distance: కరోనా నిబంధనలు.. తప్పని పెళ్లి వేడుకలు.. సామాజిక దూరం పాటిస్తూ ఈ జంట పెళ్లి ఎలా చేసుకుందో చూడండి..

కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Social Distance: కరోనా నిబంధనలు.. తప్పని పెళ్లి వేడుకలు.. సామాజిక దూరం పాటిస్తూ ఈ జంట పెళ్లి ఎలా చేసుకుందో చూడండి..
Social Distance Marriage
KVD Varma
|

Updated on: May 03, 2021 | 10:51 AM

Share

Social Distance: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, సోషల్ మీడియాలో ఈ మహమ్మారికి సంబంధించి చోటుచేసుకుంటున్న విశేషాలతో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు తమ పనులు పూర్తి చేసుకోవడానికి పడే పాట్లు చూస్తే అయ్యో అనిపించినా.. నవ్వొస్తుంది. ప్రతి విపత్తులో అవకాశాలను కనుగొని, ఇలాంటి ఫన్నీ వీడియోలను తయారుచేసే వ్యక్తులు నేట్టింట్లో చాల మంది ఉన్నారు. ఇటువంటివి చూసిన జనం నవ్వడం ఆపరు.

అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, దీనిలో, సామాజిక దూరాన్ని పాటిస్తూ, వధూవరులు చేసుకున్న పెళ్లి చూస్తే నవ్వాగదు. అందులోనూ పెళ్లి తంతులో జరిపే కార్యక్రమాలను ఒకరినొకరు దూరంగా ఉంటూ జరుపుకోవడానికి వాళ్ళు పడ్డ ఇబ్బందులు నవ్వు తెప్పిస్తాయి.

వివాహాలకు ముహూర్తాలు ముందే నిర్ణయించడం.. ఒక్కోసారి పెళ్లిని వాయిదా వేసే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బంది అయినా ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు వీడియోలో చూపించిన పెళ్లి కూడా అటువంటిదే. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందా జంట. అయితే, కోవిడ్ నిబంధల్ని తూ.చా తప్పకుంటా పాటిస్తూ ఈ వివాహం చేసుకుందా జంట. పెళ్లి వీడియోలో, వధూవరులు ఇద్దరూ వేదికపై ఒంటరిగా నిలబడి, నియమాలను పాటిస్తూ, కర్ర సహాయంతో పూలమాలలు ధరిస్తూ ఉండటం కనిపిస్తుంది. వధూవరులు ఇద్దరూ పూర్తిగా సామాజిక దూరం పాటిస్తూ పెళ్ళిచేసుకోవడం పెళ్ళికి హాజరైన అతికొద్దిమంది బంధువులు..అలాగే ఈ వీడియో చూసిన నెటిజనులు ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు ఈ పెళ్లిని చూసి నవ్వుతున్నారు. కొంతమంది భలే పని చేస్తున్నారు బాబూ అంటూ కామెంట్ చేస్తున్నారు. పెళ్ళికి సోషల్ డిస్టెన్స్ బావుంది.. మరి తరువాత? అని కొంతమంది వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇది మరీ విచిత్రంగా ఉంది. కావాలని వీడియో చేసినట్టు ఉంది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మొత్తమ్మీద ఈ సోషల్ డిస్టెన్స్ పెళ్లి సోషల్ మీడియాలో సంచలనం అయింది.

ఈ సోషల్ మీడియా పెళ్లి మీరూ చూసేయండి..

Also Read: Adopt: వాళ్ళు రిటైర్ అయి విశ్రాంతి కోరుకున్నారు..తమకంటె పెద్ద మహిళను దత్తత తీసుకున్నారు.. ఎందుకంటే..

Long COVID Symptoms: కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా ఆ మూడు సమస్యలు తప్పవు.. అధ్యయనంలో తేల్చిన నిపుణులు

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి