AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adopt: వాళ్ళు రిటైర్ అయి విశ్రాంతి కోరుకున్నారు..తమకంటె పెద్ద మహిళను దత్తత తీసుకున్నారు.. ఎందుకంటే..

సాధారణంగా మనం దత్తత అనే పదాన్ని విన్నప్పుడు, పిల్లలకు సంబంధించినదిగా భావిస్తాము. ఎందుకంటే, పిల్లలు లేని వారు తమ కోసం పిల్లలను దత్తత తీసుకుని పెంచుకోవడం మనకు తెలుసు.

Adopt: వాళ్ళు రిటైర్ అయి విశ్రాంతి కోరుకున్నారు..తమకంటె పెద్ద మహిళను దత్తత తీసుకున్నారు.. ఎందుకంటే..
Adopting Elder Woman
KVD Varma
|

Updated on: May 03, 2021 | 10:09 AM

Share

Adopt: సాధారణంగా మనం దత్తత అనే పదాన్ని విన్నప్పుడు, పిల్లలకు సంబంధించినదిగా భావిస్తాము. ఎందుకంటే, పిల్లలు లేని వారు తమ కోసం పిల్లలను దత్తత తీసుకుని పెంచుకోవడం మనకు తెలుసు. కానీ, ఒక జంట తమకు తోడుగా ఉండటం కోసం ఓ పెద్దవిడను దత్తత తీసుకుంది. ఇంటర్నెట్ లో అందరి మనసులూ గెలుచుకున్న ఈ దత్తత కథ ఏమిటో చూద్దాం.

కెనడాకు చెందిన మారిక్ ఫిన్లే, ఆమె భాగస్వామి కరిన్ కోప్ క్యూబెక్ నుండి బయలుదేరి నోవా స్కోటియా తీరానికి వెళ్లి వారి రిటైర్మెంట్ లైఫ్ ఆస్వాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్నతరువాత తమకు తోడుగా ఎవరినైనా తీసుకువెళ్ళాలని అనుకున్నారు. దీంతో తమకన్నా 20 సంవత్సరాలు పెద్దయిన తమ స్నేహితురాలు ఎలిసబెత్ బిగ్రాస్‌ను కూడా తమతో తీసుకువెళ్ళడానికి నిర్ణయించారు. అయితే, ఆమె వృద్ధురాలు అయినందున..ఆమె జీవితానికి తాము భరోసాగా ఉంటామని చెప్పడం కోసం ఆమెను దత్తత తీసుకున్నారు.

నిజానికి వీరు ముగ్గురూ చాలాకాలంగా స్నేహితులు. మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఫిన్లే , కోప్ జంటకు వృద్ధ మహిళ బిగ్రాస్‌ (86) ఆమె చివరి భర్త ద్వారా పరిచం అయ్యారు. ఆమె భర్త మరణించిన తరువాత, బిగ్రాస్ ఈ జంటకు మరింత దగ్గరయ్యారు. తరచూ వారితో ప్రయాణించేవారు. కాబట్టి, వారితో ఆమెను కూడా ఉంచుకోవాలనే నిర్ణయం సహజంగానే వచ్చింది. అలా అని ఆ నిర్ణయాన్ని అంత తేలికగా తీసుకోలేదు. చాలా ఆలోచించారు. ఏమి చేస్తే మంచిది అని. చివరకు ఆమెను దత్తత తీసుకుని తమతో తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మనోరోగ వైద్యురాలైన బిగ్రాస్‌కు పిల్లలు లేరు. ఈ జంట ఆమెను దత్తత తీసుకోవడంతో బిగ్రాస్ కోసం, ఒక కుటుంబాన్ని ఇచ్చినట్టయింది. దీంతో బిగ్రాస్ కు తనకూ ఓ కుటుంబం కలిగి ఉన్నానన్న సంతోషంతో మరింత ఆనందంగా తన వృద్దాప్యాన్ని గడపగలుగుతోంది.

ఫిన్లే-కోప్ మీడియాతో మాట్లాడుతూ ”తమ సొంత రక్త సంబంధీకులు బిగ్రాస్‌ ను దత్తత తీసుకుని, ఆమెకు ఇచ్చిన జీవితాన్ని అంతగా అర్థం చేసుకోలేరు, కాని స్థానిక సమాజం మాత్రం మేము ఒక కుటుంబం అని చాలా త్వరగా అర్థం చేసుకున్నారు.” అని చెప్పారు.

Also Read: Long COVID Symptoms: కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా ఆ మూడు సమస్యలు తప్పవు.. అధ్యయనంలో తేల్చిన నిపుణులు

Viral Video of Dogs: ఈ పెంపుడు కుక్కల పద్ధతి చూస్తే వావ్ అనాల్సిందే.. మనుషులు కూడా ఇలా చేయరేమో..!