AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారికి ఈ రోజు వచ్చే బాకీలు వసూలు అవుతాయి.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం

Horoscope Today: శ్రీప్లవనామ సంవత్సరము. ఉత్తరాయణము వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం, సప్తమి తిథి. కొందరు జీవితాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని ముందు..

Horoscope Today: ఈ రాశివారికి ఈ రోజు వచ్చే బాకీలు వసూలు అవుతాయి.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం
Subhash Goud
|

Updated on: May 03, 2021 | 7:20 AM

Share

Horoscope Today: కొందరు జీవితాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుని ముందు సాగుతుంటారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతుంటారు. మరి కొందరు జీవితాలను పెద్దగా పట్టించుకుని ఉండరు. ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్నది సాధించే వరకు ముందుకు సాగితే జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది. అయితే సోమవారం వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

మేషరాశి

ఈ రాశివారు ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ రాశివారు ఈ రోజు గోధుమ రవ్వతో పాయసం చేసి సూర్యనారాయణకు నివేదిస్తే ఎంతో మేలు జరుగుతుంది.

వృషభరాశి

ఈ రాశివారు ఈ రోజు స్నేహితులను, బంధువులు కలుసుకుంటారు.విలువైన వస్తువుల పట్ల కొంత ఆకర్షణ పెరుగుతంది. గౌరి శంకరుల దర్శనం ఎంతో మేలు చేస్తుంది.

మిథునరాశి

ఈ రాశివారు ఈ రోజు ఆర్థిక అభివృద్ధులు నెమ్మదిగా ప్రారంభిస్తుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అష్టలక్ష్మీ స్త్రోత్తరం ఎంతో మేలు చేస్తుంది.

కర్కాటకరాశి

ఈ రాశివారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడే అవకాశాలున్నాయి. వీరు శ్రీవేంకటేశ్వరస్వామి అర్చన ఎంతో మేలు చేస్తుంటుంది.

సింహరాశి

ఈ రాశిగలవారు ఈ రోజు వేర్వేరు రూపాల్లో బాకీలు వసూలు చేసుకుంటుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యమైన పనుల విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది. శివపంచాక్షరి జపం మేలు చేస్తుంది.

కన్యరాశి

కన్యారాశివారు స్నేహితులు, బంధువులను కలుసుకుంటూ ఉంటారు. ఇష్టవస్తు ప్రాప్తి ఆనందాన్ని కలుగజేస్తుంది. గణపతి దర్శనం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

తులరాశి

ఈ రాశివారు ఈ రోజు వేరువేరు రూపాల్లో వచ్చే బాకీలను వసూలు చేసుకుంటారు. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మవారి దర్శనం, చక్కర పొంగలి నివేదన మేలు చేస్తుంది.

వృశ్చికరాశి

ఈ రాశివారికి ఈ రోజు వ్యవహారిక విషయాలు కాస్త ముందుకు సాగకపోవచ్చు. కొంత అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి. లక్ష్మీనృసింహాస్వామి దర్శనం ఎంతో మేలు చేస్తుంది.

ధనుస్సురాశి

ఈ రాశివారికి ఈ రోజు చేపట్టే పనుల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నందీశ్వరున్ని దర్శించుకోవడం శుభ ఫలితాలు ఇస్తాయి.

మకరరాశి

ఈ రాశివారు నూతన వృత్తి, వ్యాపార ఉద్యోగ సంబంధమైన విషయాలు ప్రారంభిస్తారు. వీరికి శివాభిషేకం మంచి ఫలితాలను ఇస్తుంది.

కుంభరాశి

ఈ రాశివారు ఈ రోజు రావాల్సిన ప్రయోజనాలు అందుకోగలుగుతారు. వ్యక్తిగత శ్రద్ద కూడా అవసరం అవుతుంటుంది. దుర్గాదేవి పారాయణం మేలు చేస్తుంది.

మీనరాశి

ఈ రాశివారికి ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఆలోచన విధానంలో కొంత అనుకూలత ఏర్పడుతుంటుంది. హయిగ్రీవస్వామి వార్ల ఆరాధన మేలు చేస్తుంటుంది.

ఇవీ చదవండి:

Silver Price Today: దేశీయంగా నిలకడగా ఉన్న వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరల వివరాలు

Gold Price Today: దేశీయంగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు