Rasi Phalalu : ఈ రాశివారు వాహనప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య ఈ కాలం లోనూ అధికంగానే ఉంటుంది. రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని
Rasi Phalalu : రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య ఈ కాలం లోనూ అధికంగానే ఉంటుంది. రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని కొందరు ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ ఈరోజు (మే 4న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషరాశి..
మేష రాశివారు చేసే పనుల్లో జాగ్రత్త వహిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. ఏ పని చేసిన ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం మంచింది. గణపతి దర్శనం మంచి చేస్తుంది.
వృషభ రాశి..
వృషభ రాశివారు నేడు చేపట్టిన పనుల్లో చాలా శ్రద్దగా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు, విశేషమైన విష్ణు పూజ మేలు చేస్తుంది.
మిథున రాశి..
ఈరోజు మిధున రాశి వారు వారి స్నేహితులను కలుసుకుంటారు. వీరికి ఇంట బయట మంచి అనుకూలత ఏర్పడుతుంది. పార్వతి అమ్మవారి పూజ మంచి చేస్తుంది.
కర్కాటక రాశి..
ఈరోజు వీరికి స్నేహితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మహాలక్ష్మీ అమ్మవారి దర్శనం మంచింది.
సింహరాశి..
ఈరోజు వారికి దూరప్రాంతాలనుంచి కొన్ని శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నందీశ్వరుడి దర్శనం మేలు చేస్తుంది.
కన్యరాశి..
ఈరోజు వీరు వేరువేరు కారణాల వల్ల అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంటారు. సుభ్రమణ్య స్వామి దర్శనం మంచింది.
తులారాశి..
ఈరోజు వీరు ఆలోచన విధానంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని అనవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరు ఉద్యోగ విద్య విషయాల్లో మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి వ్యక్తిగత కారణాలవల్ల అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సుదర్శన స్వామి దర్శనం చేస్తుంది.
మకర రాశి..
ఈరోజు వీరు శక్తికి మించిన బాధ్యతలను తీసుకుంటుంటారు. అనవసరమైన హామీలు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
కుంభరాశి..
ఈరోజు విలువైన వాస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తలు వహించాలి.
మీనరాశి..
ఈరోజు వృత్తి, వ్యాపారాల విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి లక్ష్మీ నారాయణ స్వామి దర్శనం మేలు చేస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :