Gold Price Today: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..
Gold Price Today: పెళ్ళిళ్ల సీజన్ కావడంతో దేశ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా కొద్ది రోజులుగా...
Gold Price Today: పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా కొద్ది రోజులుగా బంగారం ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దేశీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో స్వల్ప మార్పు నమోదైంది. తులం(10 గ్రాములు) బంగారం ధరపై రూ. 200 మేర పెరిగింది. దాంతో దేశీయంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 45,360 లకు లభిస్తోంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 200 మేర పెరిగింది. ఫలితంగా తులం పసిడి ధర ఇవాళ రూ. 44,360 పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 48,000 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 44,000 వద్ద నడుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోనూ పుత్తడి రేట్లు ఇలాగే ఉన్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ. 48,000 పలుకుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 44,000 వద్ద ట్రేడ్ అవుతోంది. విశాఖపట్నంలో మేలిమి బంగారం ధర రూ. 48,000 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రూ. 44,000 పలుకుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు.. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో బంగారానికి భారీగా డిమాండ్ వస్తోంది. ఆ డిమాండ్ తగ్గట్లుగానే రేట్లు కూడా ఉన్నాయి. మంగళవారం నాడు ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 49,100 పలుకుతోంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 45,570 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ పసిడి ధరలు పరుగులు తీశాయి. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,360 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రూ. 44,360 పలుకుతోంది. చెన్నైలో పదిగ్రాముల మేలిమి బంగారం ధర రూ. 48,240 కి అమ్ముడుపోతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రూ.44,220 లుగా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 49,770 వద్ద నడుస్తుండగా.. 22 క్యారెట్ల బంగారం రూ. 46,310గా ఉంది.
Also read:
Corona Pandemic: కరోనా మహమ్మారితో కేంద్ర మంత్రి టవర్ చంద్ గాహ్లాత్ కుమార్తె గోయిత సోలంకి కన్నుమూత..