Corona Pandemic: కరోనా మహమ్మారితో కేంద్ర మంత్రి టవర్ చంద్ గాహ్లాత్ కుమార్తె గోయిత సోలంకి కన్నుమూత..
కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ప్రజలందరినీ ఒకే లెక్కలో చూస్తోంది కరోనా. ఎటువంటి బేధాలూ కరోనాకు తెలియవు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రాణాలు నిలబడని పరిస్థితి చాలామందికి వస్తోంది.
Corona Pandemic: కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ప్రజలందరినీ ఒకే లెక్కలో చూస్తోంది కరోనా. ఎటువంటి బేధాలూ కరోనాకు తెలియవు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రాణాలు నిలబడని పరిస్థితి చాలామందికి వస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి టవర్ చంద్ గాహ్లాత్ కుమార్తె గోయిత సోలంకి కరోనా బారినపడి మృతి చెందారు. ఆమె వయసు 42 సంవత్సరాలు. ఆమెకు కరోనా సోకిన తరువాత ఉజ్జయినీలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఫలితం లేకపోవడంతో పలు ఆసుపత్రులలో ఆమెకు చికిత్స చేయించడానికి ప్రయత్నించారు. అయినా, గోయిత సోలంకి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆమెను ఇండోర్ లోని వేదాంతా ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, అప్పటికే ఆమె ఊపిరితిత్తులు పాడైపోయాయి. దాదాపుగా 80 శాతం ఊపిరితిత్తులలో కరోనా వ్యాపించింది. దీంతో ఆమెను రక్షించాలేకపోయినట్టు ఆసుపత్రి డైరెక్టర్ సందీప్ శ్రీవాస్తవ వెల్లడించారు.
ఆమె మరణం పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, ఇతర పార్టీ నేతలూ విచారం వ్యక్తం చేశారు.
కాగా, సోమవారం దేశంలో కరోనా రోగుల సంఖ్య 2 కోట్లు దాటింది. 20 మిలియన్లకు పైగా ప్రజలు సోకిన రెండవ దేశంగా భారతదేశం నిలిచింది.అమెరికాలో 3.38 కోట్ల మందికి ఇప్పటివరకూ కరోనా సోకడంతో ఆ దేశం భారత్ ఉంది. అలాగే, మరణాల సంఖ్యలోనూ.. అత్యధిక మరణాలు సంభవించిన దేశాలలో మెక్సికోను అధిగమించి భారత్ మూడవ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 2 లక్ష 18 వేల 945 మంది ఇక్కడ మరణించారు.
Also Read: Online Transactions: కరోనా కారణంగా పెరిగిన డిజిటల్ లావాదేవీలు.. పాత నోట్ల రద్దు సమయం కంటే..