Black Fungus: క‌ల‌వ‌ర‌పెడుతోన్న‌ బ్లాక్ ఫంగ‌స్‌.. ఎవ‌రికి వ‌స్తుంది? ల‌క్ష‌ణాలేంటీ? ఆరోగ్య మంత్రి సూచ‌న‌లు..

Black Fungus: క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో మాన‌వాళిని వ‌దిలేలా లేదు. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రూపాన్ని మార్చుకొని మ‌రింత విరుచుకుప‌డుతోందీ మ‌య‌దారి రోగం. రోజురోజుకీ...

Black Fungus: క‌ల‌వ‌ర‌పెడుతోన్న‌ బ్లాక్ ఫంగ‌స్‌.. ఎవ‌రికి వ‌స్తుంది? ల‌క్ష‌ణాలేంటీ? ఆరోగ్య మంత్రి సూచ‌న‌లు..
Black Fungus
Follow us
Narender Vaitla

|

Updated on: May 14, 2021 | 7:58 PM

Black Fungus: క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో మాన‌వాళిని వ‌దిలేలా లేదు. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రూపాన్ని మార్చుకొని మ‌రింత విరుచుకుప‌డుతోందీ మ‌య‌దారి రోగం. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అయితే క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా ఈ మాయ‌దారి రోగం ప్ర‌జ‌ల‌ను వ‌దిలేలా క‌నిపించ‌ట్లేదు. తాజాగా బ్లాక్ ఫంగ‌స్‌/మ్యుక‌ర్‌మైకోసిస్ పేరుతో కొత్త వ్యాధి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు ఉత్త‌ర భార‌త‌దేశానికి పరిమిత‌మైన ఈ వ్యాధి తాజాగా తెలంగాణ‌లో కూడా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. దీంతో అంద‌రిలో క‌ల‌వ‌రం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్‌ ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఈ వ్యాధి గురించి చెప్పుకొచ్చిన మంత్రి.. ఇటీవ‌లి కాలంలో ఈ వ్యాధిని కొంత మంది కోవిడ్ రోగుల్లో గుర్తించామ‌ని చెప్పుకొచ్చారు. మొద‌ట్లోనే రోగ నిర్ధార‌ణతో ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుక‌ట్ట‌వేయ‌వ‌చ్చ‌ని హ‌ర్ష వ‌ర్ధ‌న్ సూచించారు. ఈ వ్యాధి అంత‌కు ముందు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ఎక్కువ‌గా ప్రభావితం చేస్తుందని చెప్పిన మంత్రి.. ఇది పర్యావరణ వ్యాధికారకాలతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుందన్నారు.

ఎవరికి సోకే అవ‌కాశం ఉంది..

* చక్కెర స్థాయి నియంత్రణలో లేనివారు, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడిన వారిలో ఈ వ్యాధి బయటపడుతోంది. * కరోనా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న కొందరిలో దీన్ని గుర్తిస్తున్నారు. * ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిలో కూడా ఇది వెలుగుచూస్తోంది.

ల‌క్ష‌ణాలు..

* కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని మంత్రి వెల్లడించారు.

* అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు చెబుతున్నారు.

Also Read: YS Sharmila : కరోనాతో పెద్ద దిక్కు కోల్పోయిన తెలంగాణ ఆడ బిడ్డలకు షర్మిల అండ, “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు

Shopping in Pandemic: షాపింగ్ అలవాట్లు మార్చేసిన కరోనా..పెరిగిన మద్యం వినియోగం..తగ్గిన జంక్ ఫుడ్..ఆసక్తికర సర్వే!

Abhiram: ‘త‌ప్పులు అంద‌రూ చేస్తారు.. నా త‌ప్పులు బ‌య‌ట‌ప‌డ్డాయి అంతే’.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రానా త‌మ్ముడు..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.