AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 4549 కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. కొత్త‌గా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 87756 క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా.. 4549 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి....

AP Corona Cases: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 4549 కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా
Ap Corona
Follow us

|

Updated on: Jun 14, 2021 | 6:01 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతుంది. కొత్త‌గా 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 87756 క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా.. 4549 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 18,14,393కు పెరిగింది. మ‌రో 59 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఫ‌లితంగా మొత్తం మ‌ర‌ణాల సంఖ్య  11,999 కు చేరింది.  రాష్ట్రంలో కరోనా నుంచి మరో 10,114 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 17,22,381 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 80,013 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,05,38,738 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. చిత్తూరు జిల్లాలో 860, తూ.గో. జిల్లాలో 619 కరోనా కేసులు నమోద‌య్యాయి. ప.గో. జిల్లాలో 529, కడప జిల్లాలో 412 కరోనా కేసులు వెలుగుచూశాయి.

కొత్త‌గా న‌మోదైన మ‌ర‌ణాల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, ప్రకాశంలో 8 మంది, పశ్చిమగోదావరిలో ఆరుగురు, కృష్ణ జిల్లాలో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో ముగ్గురు, కడప, నెల్లూరులో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో క‌రోనా వివ‌రాలు ఇలా

దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజులుగా లక్ష దిగువనే నమోదవుతోన్న కేసులు.. ఆదివారం మరి కాస్త తగ్గాయి. కొత్త‌గా 70,421 మందికి కరోనా సోకింది. సుమారు 74 రోజుల తర్వాత ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. ఆదివారం 14,92,152 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..70,421 మందికి వైరస్ పాజిటివ్ అని తేలింది. ఏప్రిల్ ఒకటి తరవాత కొత్త కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. అయితే ఆదివారం నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తక్కువగానే ఉండటం కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. ఆదివారం 3,921 మరణాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 2.95కోట్లకు పైబడగా..3,74,305 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్యసిబ్బందికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన జగన్ స‌ర్కార్

జోక్ నచ్చ‌లేదు.. పెళ్లి కొడుక్కి తిక్క లేచింది.. ఏం చేశాడో మీరే చూడండి