Andhra Government: కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్యసిబ్బందికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన జగన్ స‌ర్కార్

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది. జూనియర్‌ డాక్టర్ల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ను నెరవేర్చింది. కోవిడ్‌తో మరణించే వైద్యులు....

Andhra Government: కరోనాతో చనిపోయిన ప్రభుత్వ వైద్యసిబ్బందికి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన జగన్ స‌ర్కార్
Cm Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 14, 2021 | 6:06 PM

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది. జూనియర్‌ డాక్టర్ల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ను నెరవేర్చింది. కోవిడ్‌తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కోవిడ్‌ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు.. స్టాఫ్‌ నర్సుకి రూ.20 లక్షలు, ఎఫ్‌ఎస్‌ఓ లేదా ఎమ్‌ఎస్‌ఓలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో వెల్లడించింది. తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.

హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్ష:

మ‌రోవైపు హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాల్లో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు విషయంలో కొన్ని సూచనలు చేశారు. జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు తీసుకువ‌చ్చేలా ప్ర‌ణాళిక‌లు ఉండాలని సీఎం సూచించారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో పెద్ద ఆస్పత్రుల్లో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు, టెక్నాలజీ, సదుపాయాలు మ‌న ద‌గ్గ‌ర కూడా అందుబాటులోకి తేవడమే హెల్త్‌ హబ్స్ ప్ర‌ధాన ఉద్దేశమని సీఎం చెప్పారు. 2 వారాల్లోగా హెల్త్ హబ్స్‌పై విధివిధానాలు ఖరారు కావాలన్నారు.

Also Read: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 4549 కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా

జోక్ నచ్చ‌లేదు.. పెళ్లి కొడుక్కి తిక్క లేచింది.. ఏం చేశాడో మీరే చూడండి

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్