అనంతపురంలో నకిలీ మద్యం కలకలం.. ప్రాణాలతో చెలగాటం

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా మద్యం షాపులన్నీ మూతపడ్డాయి. దీంతో మందుబాబుల బాధలు వర్ణనాతీతమనే చెప్పాలి. కొందరయితే మందు లేదని బాధతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అవసరాన్నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అక్రమంగా నకిలీ మద్యం తెచ్చి విక్రయాలు..

అనంతపురంలో నకిలీ మద్యం కలకలం.. ప్రాణాలతో చెలగాటం
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2020 | 8:12 AM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా మద్యం షాపులన్నీ మూతపడ్డాయి. దీంతో మందుబాబుల బాధలు వర్ణనాతీతమనే చెప్పాలి. కొందరైతే మందు లేదనే బాధతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అవసరాన్నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అక్రమంగా నకిలీ మద్యం తెచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఏపీ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఈ దందా ఎక్కువగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న నకలీ మద్యం సీసాలను ఏపీ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని మనేసముద్రం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో తరలిస్తున్న నకిలీ మద్యం సీసాలను అధికారుల స్వాధీనం చేసుకున్నారు.

హిందూపురం పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు బెంగుళూరు నుంచి కారులో తరలిస్తున్న 5 కేసుల నకిలీ మద్యాన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా మరికొందరి నుంచి పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యాన్ని తరలిస్తున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. ఎరుకల శ్రీనివాసులు అనే వ్యక్తి నుంచి 5 కేసులు(240 సీసాలు), గిరీష్ కుమార్ (48 సీసాలు), గంగాధర్ నాయక్ (96 సీసాలు), ఆది (96 సీసాలు), ఈశ్వర్ అనే వ్యక్తి వద్ద నుంచి 133 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. మొత్తం 851 నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శంకర్, సీఐ నరసింహులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: 

ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలతో పాటు ఇన్సెంటీవ్స్‌ కూడా

మరో నటుడ్ని బలితీసుకున్న కరోనా.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ

కరోనా ఎఫెక్ట్: స్థానికున్ని కొట్టి చంపిన యువకులు

కరోనా దెబ్బ.. మోదీ సర్కార్ భారీ అప్పు

లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు

కరోనా వైరస్: ప్రపంచంలో టాప్ 10 హై రిస్క్ అండ్ సేఫ్ కంట్రీస్ ఇవే!

వైన్స్‌‌ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్