కరోనా మిగిల్చిన విషాదం.. పద్మశ్రీ నిర్మల్ సింగ్ ఖల్సా మృతి

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే 1800కు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ మహమ్మారి పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సాను కూడా పొట్టనపెట్టుకుంది. గురువారం తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. నిర్మల్ సింగ్ ఖల్సాకు తాజాగా జరిపిన పరీక్షల ఫలితాలు బుధవారం వచ్చాయి. ఈ రిపోర్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో.. వెంటనే ఆయన్ను ఐసోలేషన్‌కు తరలించి చికిత్స […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:07 am, Thu, 2 April 20
కరోనా మిగిల్చిన విషాదం.. పద్మశ్రీ నిర్మల్ సింగ్ ఖల్సా మృతి

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే 1800కు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ముప్పై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ మహమ్మారి పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సాను కూడా పొట్టనపెట్టుకుంది. గురువారం తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు.

నిర్మల్ సింగ్ ఖల్సాకు తాజాగా జరిపిన పరీక్షల ఫలితాలు బుధవారం వచ్చాయి. ఈ రిపోర్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో.. వెంటనే ఆయన్ను ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయ కమిటీలో నిర్మల్ సింగ్ ఖల్సా పనిచేశారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయన మరణించినట్లు పంజాబ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేబీఎస్ సిద్ధూ వెల్లడించారు.