CUET UG 2025: సీయూఈటీ-యూజీ పరీక్షలో కీలక మార్పులు.. యూజీసీ ఛైర్మన్‌ ఎం జగదీశ్

సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే CUET UG 2025 పరీక్షలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్ష విధానంతోపాటు సబ్జెక్టుల సంఖ్యను కూడా కుదించారు. ఈ విధానం వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానుంది..

CUET UG 2025: సీయూఈటీ-యూజీ పరీక్షలో కీలక మార్పులు.. యూజీసీ ఛైర్మన్‌ ఎం జగదీశ్
changes in CUET UG Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 14, 2024 | 3:10 PM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14: దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష CUET-UG లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ఛైర్మన్‌ ఎం.జగదీశ్ కుమార్‌ స్వయంగా వెల్లడించారు. ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్షలు వచ్చే ఏడాది నుంచి కేవలం కంప్యూటర్‌ ఆధారిత (CBT) విధానంలోనే నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. 12వ తరగతిలో చదివిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా సీయూఈటీ పరీక్ష పరీక్ష రాసేందుకు వచ్చే ఏడాది (2025) అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అంటే డిగ్రీ చదివేందుకు విద్యార్ధి ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకోవచ్చన్నమాట. సీయూఈటీ – యూజీలో ప్రతిపాదిత మార్పులపై తాము ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్‌ సమీక్షించిందని యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్ కుమార్‌ వెల్లడించారు.

గతేడాది సీయూఈటీ (యూజీ) పరీక్ష హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహించామన్నారు. కానీ 2025 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అలాగే ఈ పరీక్షలో సబ్జెక్టుల్ని 63 నుంచి 37కు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో అభ్యర్థులు గరిష్ఠంగా ఆరు సబ్జెక్టులకు పరీక్ష రాసే అవకాశం ఉండేది. కానీ ఇకపై దాన్ని ఐదు సబ్జెక్టులకు కుదిస్తున్నామని తెలిపారు. అలాగే, ఆయా సబ్జెక్టులను బట్టి గతంలో పరీక్ష వ్యవధి 45 నిమిషాల నుంచి 60 నిమిషాలుగా ఉండేది. ప్రస్తుతం ఆ వ్యవధిని 60 నిమిషాలుగా నిర్ణయించడంతో పాటు ఆప్షనల్‌ ప్రశ్నల కాన్సెప్ట్‌ను సైతం రద్దు చేస్తున్నామని తెలిపారు. కాగా ఈ ఏడాది మే 15 నుంచి 29 వరకు జరిగిన సీయూఈటీ (యూజీ) పరీక్షను 63 సబ్జెక్టులకు నిర్వహించారు. ఎక్కువ దరఖాస్తు వచ్చిన 15 సబ్జెక్టులకు పెన్ను, పేపర్‌ (ఆఫ్‌లైన్‌) విధానంలో మిగతా 48 సబ్జెక్టులకు సీబీటీ విధానంలో పరీక్షలు జరిగాయి. దేశ వ్యాప్తంగా మొత్తం13.48 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు.

నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదల.. జనవరి 18న పరీక్ష

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 653 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 18న జరగనుంది. పరీక్ష ఫలితాలు మార్చి నెలలో వెల్లడిస్తారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యతోపాటు వసతి సౌకర్యాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.