SSC CHSL Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టులు! మొత్తం ఎన్నంటే

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024’ పోస్టుల సంఖ్య భారీగా పెరిగాయి. ఈ మేరకు ఎస్సెస్సీ తాజాగా ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే టైర్ 1, టైర్ 2 పరీక్షలు పూర్తి చేసిన కమిషన్.. త్వరలోనే ఫలితాలు వెల్లడించనుంది..

SSC CHSL Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. భారీగా పెరిగిన సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టులు! మొత్తం ఎన్నంటే
SSC CHSL Posts
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 14, 2024 | 2:46 PM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14: ఇంటర్మీడియట్‌ అర్హతతో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునళ్ల తదితర సంస్థల్లో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మొత్తం 3,712 వరకు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన జారీ చేసింది. అయితే ఈ పోస్టులను పెంచుతూ తాజాగా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన జారీ చేసింది. అదనంగా 242 ఖాళీలను జత చేస్తూ కమిషన్‌ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 3954కి చేరింది.

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో అవసరాల దృష్ట్యా 3,954 సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే టైర్‌ 1 పరీక్షలు జులైలో నిర్వహించింది. దీని ఫలితాలు సెప్టెంబర్‌ 6న విడుదలయ్యాయి. నవంబర్‌ 18న టైర్‌ 2 పరీక్ష కూడా నిర్వహించింది. త్వరలో ఫలితాలు విడుదల కానున్నాయి. టైర్‌ 1, టైర్‌ 2 పరీక్షల అనంతరం కంప్యూటర్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం తుది జాబితా విడుదల చేస్తారు.

నాగార్జున యూనివర్సిటీ యోగాలో ప్రవేశాలకు తుది గడువు పెంపు

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఎమ్మెస్సీ యోగా మొదటి ఏడాది, డిప్లొమా ఇన్‌ యోగాలో చేరేందుకు గుది గడువును పెంచినట్లు వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ జాన్సన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తుది గడువు డిసెంబరు 16 వరకు పెంచినట్లు పేర్కొన్నారు. ఎమ్మెస్సీ రెండో సంవత్సరంలో చేరేందుకు తప్పనిసరిగా పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలన్నారు. మరిన్ని వివరాలను ఏఎన్‌యూ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచామని, విద్యార్ధులు ఆయా వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని జాన్సన్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.