TSPSC Group 3 Prelims Exam Date: జులై లేదా ఆగస్టులో తెలంగాణ గ్రూప్ 3 ప్రిలిమినరీ రాత పరీక్ష.. ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తులు
తెలంగాణలో గ్రూప్ 3 పోస్టులకు ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించనుంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,365 పోస్టులకు జ..
తెలంగాణలో గ్రూప్ 3 పోస్టులకు ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించనుంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,365 పోస్టులకు జనవరి 23న ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 వరకు గడువిచ్చారు. డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 1, 2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసుండాలి. దరఖాస్తు సమయంలో ప్రతిఒక్కరూ రూ.280లు రిజిస్ర్టేషన్ ఫీజు చెల్లించాలి. టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ లో పూర్తి నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి అభ్యర్థి 12 కేంద్రాలను ప్రాధాన్యం వారీగా ఎంపిక చేసుకోవచ్చు. మొత్తం మూడు పేపర్లకుగానూ 450 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. వీటితోపాటు 783 గ్రూప్ 2 పోస్టులకు కూడా ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 16తో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.