Study Abroad: ఉన్నత విద్యకు ఈ దేశాలు బెస్ట్.. నాణ్యమైన చదువులు, అతి తక్కువ ఫీజులు..

అయితే చాలా దేశాలు విదేశీ విద్యార్థులకు ఉచిత లేదా తక్కువ ఫీజులతోనే ఉన్నత విద్యను ఎక్కడా రాజీ పడకుండా అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అండర్ గ్రాడ్యూయేట్ స్థాయిలో విదేశీ విద్యార్థులకు ఉచిత లేదా తక్కువ ఫీజులతో విద్యనందించే దేశాల వివరాలు..

Study Abroad: ఉన్నత విద్యకు ఈ దేశాలు బెస్ట్.. నాణ్యమైన చదువులు, అతి తక్కువ ఫీజులు..
Study Abroad
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 25, 2023 | 4:59 PM

విదేశీ విద్యకు ఇటీవల కాలంలో ప్రాచుర్యం పెరిగింది. నాణ్యమైన విద్యతో పాటు విస్తారమైన ఉపాధి అవకాశాలున్న నేపథ్యంలో అందరూ వివిధ దేశాలకు వెళ్లిపోయి చదువుకునేకుందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రముఖ యూనివర్సిటీల్లో సీటు కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అది పీజీ అయినా, డిగ్రీ అయినా. ఆ డిమాండ్ ను తట్టుకొని అందరూ మంచి యూనివర్సిటీల్లో సీటు సాధించడం కష్టమవుతోంది. దీంతో చిన్న చిన్న యూనివర్సిటీల్లో నైనా చేరేందుకు విద్యార్థులు వెనుకాడటం లేదు. అయితే యూకే లో టాప్ యూనివర్సిటీల్లో తప్ప చిన్న చిన్న వాటిల్లో చదువుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదు. అయితే చాలా దేశాలు విదేశీ విద్యార్థులకు ఉచిత లేదా తక్కువ ఫీజులతోనే ఉన్నత విద్యను ఎక్కడా రాజీ పడకుండా అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అండర్ గ్రాడ్యూయేట్ స్థాయిలో విదేశీ విద్యార్థులకు ఉచిత లేదా తక్కువ ఫీజులతో విద్యనందించే దేశాల వివరాలు ఇప్పుడు చూద్దాం..

జర్మనీ.. ప్రపంచంలో విదేశీ విద్యార్థులకు ఉచిత విద్యను అందించే దేశాలలో జర్మనీ మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడి పలు యూనివర్సిటీలు ఇంగ్లిష్ మాద్యమంలో ఎటువంటి ట్యూషన్ ఫీజు లేకుండా ఉచిత విద్యను అందిస్తున్నాయి. పైగా ఈ యూనివర్సిటలు గ్లోబల్ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ ఉన్నావే. అతి తక్కువ బడ్జెట్ లో అత్యంత నాణ్యమైన విద్యను పొందుకోవాలనుకునే భారతీయన విద్యార్థులకు జర్మనీ బెస్ట్ ఆప్షన్.

స్పెయిన్.. స్పానిష్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించాలనుకునే అండర్ గ్రాడ్యూయేట్ భారతీయ విద్యార్థులు చిన్న మొత్తంలో ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అయితే అక్కడ జీవించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. నాణ్యమైన విద్య అందుతుంది. పబ్లిక్ యూనివర్సిటీలు వెయ్యి యూరోలు అంటే దాదాపు రూ. 85000 ట్యూషన్ ఫీజు వసూలు చేస్తాయి. అంతర్జాతీయ విద్యార్థులు అదనంగా స్పానిష్ నేర్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రియా.. ఇక్కడి యూనివర్సిటీల్లో చదవాలి అనుకునే భారతీయ విద్యార్థులు సెమిస్టర్ కి 730 యూరోలు అంటే దాదాపు రూ. 62,000 ట్యూషన్ ఫీజు కింద కట్టాల్సి ఉంటుంది. నాణ్యమైన విద్యతో పాటు ఉన్నత స్థాయి జీవన ప్రమాణాలను కలిగి ఉంది. మన భారతీయ విద్యార్థులకు ఇది కూడా ఒక మంచి ఆప్షన్..

ఫ్రాన్స్.. ఇక్కడి కొన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు ఫ్రీ ఎడ్యూకేషన్ ను అందిస్తాయి. మరికొన్ని యూనివర్సిటీలో చాలా తక్కువ ఫీజును వసూలు చేస్తాయి. ఫ్రాన్స్ దేశంలో విద్యకు ప్రపంచ వ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ నాణ్యమైన విద్యతో పాటు ఉత్తమ ఉద్యోగావకాశాలు పొందుకొనే అవకాశం ఉంటుంది.

బెల్జియం.. ఈ యూరోపియన్ దేశం కూడా సాధారణ ట్యూషన్ ఫీజుతో అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తుంది. ఈ దేశం జీవించడానికి చాలా అనువైన ప్రాంతం. అలాగే ప్రొఫెషనల్ గా ఎదగడానికి మంచి స్కోప్ ఉంటుంది.

ఇటలీ.. ఇక్కడ విద్యార్థులకు మంచి కెరీర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, నాణ్యమైన విద్య, అత్యుత్తమ టీచింగ్ ఫ్యాకల్టీ, మోడ్రన్ కరిక్యూలమ్ తో పాటు పరిశోధనకు మంచి అవకాశాలు కల్పిస్తుంది. ఇక్కడ చదువుకోవాలంటే 1800 యూరోలు అంటే రూ.1,54000 ట్యూషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

గ్రీస్.. ఇక్కడ అన్ని యూనివర్సిటీల్లోనూ విదేశీ విద్యార్థులకు ఉచిత విద్యకు అవకాశం ఉంది. ఇక్కడ కాస్త్ ఆఫ్ లివింగ్ కూడా చాలా సాధారణంగా ఉంటుంది. ఇక్కడి చారిత్రక నేపథ్యం ఉన్న కల్చర్ చక్కని జీవన ప్రమాణాలను నెలకొల్పుతుంది.

స్కాలర్ షిప్ అందించేవి..

వీటితో పాటు మరికొన్ని దేశాలు మన భారతీయ విద్యార్థలు పూర్తి స్కాలర్ షిప్స్ అందిస్తాయి. వాటిల్లో స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, యూనైటెడ్ కింగ్ డమ్, నెదర్లాండ్స్ వంటి దేశాలు అండర్ గ్రాడ్యూయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యూయేషన్ చేయడానికి మంచి ఆప్షన్లు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!