TS Inter Admissions 2024: తెలంగాణ ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల షెడ్యూల్‌ ఇదే.. జూన్‌ 1 నుంచి తరగతులు

తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల ప్రవేశాల తేదీలను విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర జూనియర్‌ కాలేజీల్లో సంబంధించి మే 9 నుంచి మే 31 వరకు ప్రవేశాల..

TS Inter Admissions 2024: తెలంగాణ ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల షెడ్యూల్‌ ఇదే.. జూన్‌ 1 నుంచి తరగతులు
TS Inter Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: May 09, 2024 | 3:45 PM

హైదరాబాద్‌, మే 9: తెలంగాణలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల ప్రవేశాల తేదీలను విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర జూనియర్‌ కాలేజీల్లో సంబంధించి మే 9 నుంచి మే 31 వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. పదో తరగతి గ్రేడు, రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇంటర్ ప్రవేశాలకు ప్రైవేటు కాలేజీలు ప్రవేశ పరీక్షలు పెడితే కఠిన చర్యల తప్పవంటూ ఇంటర్‌ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మైనారిటీ, సహకార, గురుకుల, కేజీబీవీ, ఆర్‌జేసీ, మోడల్, కాంపొజిట్, ఒకేషనల్ తదితర జూనియర్ కాలేజీలు ఈ షెడ్యూల్‌ను పాటించాలని బోర్డు స్పష్టం చేసింది. ప్రతి కాలేజీ ప్రవేశ ద్వారం వద్ద మంజూరైన సెక్షన్లు, భర్తీ చేసే సీట్ల వివరాలను తప్పనిసరిగా ఏరోజు కారోజు ప్రదర్శించాలి. ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న పదో తరగతి మార్కుల మెమోలను ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకోవాలని బోర్డు ఆయా కాలేజీలకు సూచించింది. ప్రవేశాల్లో నిర్దేశిత రిజర్వేషన్లు అమలు చేయాలని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. పదో తరగతి ఉత్తీర్ణత తర్వాత గ్యాప్‌ తీసుకున్న విద్యార్ధులు ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలనుకుంటే స్థానిక, నివాస ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. పదో తరగతి జీపీఏ, సబ్జెక్ట్ వారీగా గ్రేడ్‌పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక సెక్షన్‌లో 88 మందికి మించి విద్యార్థులను చేర్చుకోకూడదన స్పష్టం చేసింది. ఒక వేళ అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయాలనుకుంటే ఇంటర్‌బోర్డు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: మే 9, 2024.
  • మొదటి దశ ప్రవేశాలు: మే 9, 2024 నుంచి ప్రారంభం
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు ముగింపు తేదీ: జూన్ 30, 2024.
  • ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు ప్రారంభ తేదీ: జూన్ 1, 2024.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.