AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Data security: ఈ కోర్సు చేస్తే ఉద్యోగం పక్కా.. రానున్న రోజుల్లో ఫుల్‌ డిమాండ్..

కంపెనీలు తమ డేటా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల వంటివి డేటా సెక్యూరిటీ పెద్ద పీట వేస్తున్నాయి. ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరుగుతోన్న నేపథ్యంలో డేటాను రక్షించుకోవడం పెద్ద టాస్క్‌గా మారింది. దీంతో డేటాను భద్రంగా ఉంచేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే డేటా సెక్యూరిటీ నిపుణులు అవసరపడుతున్నారు...

Data security: ఈ కోర్సు చేస్తే ఉద్యోగం పక్కా.. రానున్న రోజుల్లో ఫుల్‌ డిమాండ్..
Data Security
Narender Vaitla
|

Updated on: May 09, 2024 | 3:45 PM

Share

మారుతోన్న కాలం, టెక్నాలజీకి అనుగుణంగా విద్యా విధానంలోనూ మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం డేటా ప్రపంచాన్ని శాసిస్తోంది. సోషల్‌ మీడియా మొదలు ఈకామర్స్‌ వరకు అన్ని రంగాల్లో డేటా అనివార్యంగా మారింది. దీంతో డేటా స్టోరోజ్‌తో పాటు డేటా సెక్యూరిటీకి కూడా డిమాండ్‌ పెరిగింది. డేటా వెలకట్టలేని అస్త్రంగా మారిన సమయంలో డేటా సెక్యూరిటీకి భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. సైబర్ సెక్యూరిటీలో ఒక విభాగం ఈ డేటా సెక్యూరిటీ.

కంపెనీలు తమ డేటా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల వంటివి డేటా సెక్యూరిటీ పెద్ద పీట వేస్తున్నాయి. ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరుగుతోన్న నేపథ్యంలో డేటాను రక్షించుకోవడం పెద్ద టాస్క్‌గా మారింది. దీంతో డేటాను భద్రంగా ఉంచేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే డేటా సెక్యూరిటీ నిపుణులు అవసరపడుతున్నారు. దీంతో ఈ కోర్సుకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. వచ్చే రోజుల్లో డేటా సెక్యూరిటీకి మరింత డిమాండ్‌ ఉండే అవకాశాలున్న నేపథ్యంలో ఔత్సాహిక యువత ఇటుగా అడుగులు వేస్తోంది.

టెక్నికల్ డిగ్రీ మాత్రమే కాకుండా.. సాధారణ డిగ్రీ చేసిన వారు కూడా డేటా సెక్యూరిటీ కోర్సులు చేస్తే మంచి కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం బిగ్ డేటా, డేటా అనలిటిక్స్‌ వంటి సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు పీజీలో డేటా సైన్స్‌ వంటి కోర్సులను చేయొచ్చు. సైబర్‌ సెక్యూరిటీలో ఒక విభాగమైన డేటా సెక్యూరిటీలో మంచి ఆకర్షణీయమైన వేతనాలను కంపెనీలు అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కొన్ని సంస్థలు సైబర్ సెక్యూరిటీలో ఉచితంగా సర్టిఫికేషన్‌ కోర్సులను సైతం అందిస్తున్నాయి.

ఇదిలా ఉంటే వేతనాల విషయానికొస్తే డేటా సంబంధిత విభాగాల్లో ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ఈ రంగంలో ఉద్యోగం సాధిస్తే ప్రారంభ వేతనం ఏటా రూ. 5 లక్షల ప్యాకేజీ నుంచి ప్రారంభమవువుతుంది. గరిష్టంగా రూ. 8 లక్షల వరకు పొందొచ్చు. రానున్న రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరగనున్న క్రమంలో కచ్చితంగా డేటా సెక్యూరిటీకి మరింత డిమాండ్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?