TS EAPCET 2024 Answer Key: మరో రెండు రోజుల్లో తెలంగాణ ఈఏపీసెట్‌ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు ఇదే

తెలంగాణలో ఈఏపీసెట్‌ 2024 ప్రవేశ పరీక్షలు జరగుతున్న సంగతి తెలిసిందే. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షలు మే 7, 8 తేదీల్లో జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్‌ కీని మే 11వ తేదీన విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు మే 11 నుంచి 13వ తేదీ వరకు ప్రిలిమినరీ ఆన్సర్‌ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌..

TS EAPCET 2024 Answer Key: మరో రెండు రోజుల్లో తెలంగాణ ఈఏపీసెట్‌ ప్రిలిమినరీ 'కీ' విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు ఇదే
TS EAPCET 2024 Answer Key
Follow us
Srilakshmi C

|

Updated on: May 09, 2024 | 3:17 PM

హైదరాబాద్‌, మే 9: తెలంగాణలో ఈఏపీసెట్‌ 2024 ప్రవేశ పరీక్షలు జరగుతున్న సంగతి తెలిసిందే. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ పరీక్షలు మే 7, 8 తేదీల్లో జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్‌ కీని మే 11వ తేదీన విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు మే 11 నుంచి 13వ తేదీ వరకు ప్రిలిమినరీ ఆన్సర్‌ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ విడుదలైన తర్వాత కీపై అభ్యంతరాలు ఉంటే మే 13వ తేదీ ఉదయం 11 గంటల్లోపు తెలియజేయాలని సూచించింది. అభ్యంతరాలను కేవలం ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే సమర్పించాలని, ఆఫ్‌లైన్‌ వచ్చిన వాటిని స్వీకరించబోమని స్పష్టం చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు (మే 9) నుంచి మే 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ఈ ఏడాది ఈఏపీసెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా దాదాపు 3,54,803 మంది విద్యార్థులు రిజిస్ట్రేష‌న్లు చేసుకున్నారు. మొత్తం 21 జోన్లలో ఈ పరీక్షలు జరగుతున్నాయి. వీటిల్లో ఏపీలోనూ 5 జోన్లు ఏర్పాటు చేశారు. ఇక నిన్న (మే8న) జరిగిన ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షకు దాదాపు 91.67% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గతేడాది రెండో రోజు పరీక్షకు 89.5 శాతం మంది అభ్యర్థులు హాజరుకాగా.. ఈసారి ఆ సంఖ్య పెరిగింది. తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు జూన్ 15న ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..