Engineering Colleges: తెలంగాణలో భారీగా మిగిలిపోయిన ఇంజనీరింగ్‌ సీట్లు.. కొన్ని బ్రాంచ్‌లలో అయితే 40 శాతం కూడా..

Engineering Colleges: రాష్ట్రంలో జరిగిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తీరును గమనిస్తే విద్యార్థుల అభిరుచులు మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విపరీమైన క్రేజ్‌ ఉన్న ఇంజనీర్‌ సీట్లకు ప్రస్తుతం డిమాండ్‌...

Engineering Colleges: తెలంగాణలో భారీగా మిగిలిపోయిన ఇంజనీరింగ్‌ సీట్లు.. కొన్ని బ్రాంచ్‌లలో అయితే 40 శాతం కూడా..
Engineering Studetns
Follow us

|

Updated on: Dec 04, 2021 | 8:32 AM

Engineering Colleges: రాష్ట్రంలో జరిగిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తీరును గమనిస్తే విద్యార్థుల అభిరుచులు మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విపరీమైన క్రేజ్‌ ఉన్న ఇంజనీర్‌ సీట్లకు ప్రస్తుతం డిమాండ్‌ తగ్గినట్లు కనిపిస్తోంది. ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోవడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఈసారి ఏకంగా 20 శాతం సీట్లు మిగిలిపోవడం గమనార్హం. తెలంగాణలో మొత్తం 175 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా వాటిలో సుమారు 79,856 సీట్లు ఉన్నాయి. ఎంసెట్‌ పరీక్ష అనంతరం కౌన్సెలింగ్‌లో 57,177 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. అంటే 22,679 సీట్లు మిగిలాయి. ఈ లెక్కన మొత్తం సీట్లల్లో 71.60 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి.

సీట్లు భారీగా మిగిలిపోయన్న కారణంతో స్పాట్‌ అడ్మిషన్‌ నిర్వహించారు. తాజాగా శుక్రవారం ఈ స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ తర్వాత కూడా పెద్దఎత్తున ఇంజనీరింగ్‌ సీట్లు మిగిలినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భర్తీ అయిన సీట్లలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ సీట్లు బాగానే భర్తీ అయ్యాయి. అయితే ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ర్టానిట్స్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌, మెకానికల్‌ వంటి విభాగంలో సీట్లు భారీగా మిగిలిపోయాయి. ముఖ్యంగా సివిల్‌, మెకానికల్‌ విభాగాల్లోని సీట్లు 40 శాతం కూడా నిండకపోవడం గమనార్హం.

ఇక ప్రస్తుతం మిగిలిన సీట్లను భర్తీ చేయాలంటే వాటిని ‘బీ’ కేటగిరిలోకి మార్చాల్సి ఉంటుంది. కాలేజీల అభ్యర్థన మేరకే ప్రభుత్వం సీట్లను ‘బీ’ కేటగిరిలో భర్తీ చేసుకోవడానికి అనుతమిస్తారు. అయితే కన్వీనర్‌ కోటాలోనే భర్తీకానీ సీట్లు బీ కేటగిరిలోకి మార్చిన తర్వాత భర్తీకావడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read: Omicron: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ విలయ తాండవం.. అంతకంతకు పెరుగుతున్న కొత్త కేసులు..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరతాయి.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Viral Video: ఆహా.. ఈ కోతి పిల్లది ఏమి రాజసం గురూ.. ఫ్రీగా ఎంజాయ్ చేస్తోంది..!