స్నేహితులు లేని వ్యక్తులు ఈ లోకంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం కూడా ఒక అదృష్టమే. స్నేహ మాధుర్యాన్ని మాటల్లో వర్ణించలేం. ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, ఈ స్నేహ నియమం మనుషులకే కాదు.. జంతువులకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వైరల్‌లో వీడియోలో కోతి, పిల్లి స్నేహం అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోలో ఓ పిల్లి.. కోతి పిల్లను తన వీపుపై ఎక్కించుకుని కలియతిరుగుతుంది. పిల్లి వీపుపై హాయిగా పడుకున్న కోతి.. దర్జాగా స్వారీ చేస్తుంది. పిల్లి నెమ్మదిగా నడిచినంత సేపు.. ప్రశాంతంగా రైడింగ్‌ను ఎంజాయ్ చేసింది కోతి. అయితే, పిల్లి ఉన్నపళంగా వేగం పెంచడంతో ఆందోళన చెందని కోతి.. కిందకు దూకేసింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. పిల్లి, కోతి స్నేహం అందరి హృదయాలను గెలుచుకుందన్నారు. ఈ వైరల్ వీడియోను మీరూ ఎంజాయ్ చేయండి.
Viral Video:
Also read:
Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?
Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!