Omicron: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ విలయ తాండవం.. అంతకంతకు పెరుగుతున్న కొత్త కేసులు..

శాంతించిందనుకుంటోన్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ రూపంలో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతోంది

Omicron: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ విలయ తాండవం.. అంతకంతకు పెరుగుతున్న కొత్త కేసులు..
Omicron Variant Corona
Follow us

|

Updated on: Dec 04, 2021 | 7:27 AM

శాంతించిందనుకుంటోన్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ రూపంలో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతోంది. డెల్టా వేరియంట్‌ కంటే ఈ కొత్త వేరియంట్‌ మరింత ప్రమాదకరమైనదని, టీకాలు కూడా తక్కువ ప్రభావం చూపిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఒమిక్రాన్‌ పుట్టినిల్లుగా భావిస్తోన్న సౌతాఫ్రికాలో అంతకంతకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. గతంలో కంటే పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. కాగా మరణాల లెక్కలు మాత్రం కాస్త ఊరట కలిగిస్తున్నాయి.

తాజా రిపోర్టు ప్రకారం దక్షిణాఫ్రికాలో శుక్రవారం (డిసెంబర్‌3) 16,055 కొత్త కేసులు నమోదయ్యాయి. గతవారంతో పోల్చుకుంటే ఇవి 468 శాతం ఎక్కువని నివేదికలు చెబుతున్నాయి. ఇక కొత్తగా 25 మంది మహమ్మరి కారణంగా మృత్యువాత పడ్డారు. అయితే గతవారం రోజులుగా దేశంలో భారీగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని, రోజురోజుకూ వైరస్‌ బారిన పడేవారి సంఖ్య పెరుగుతోందని అక్కడి అధికారులు చెబుతున్నారు. మంగళవారం 4, 373 మంది వైరస్‌ బారిన పడగా బుధవారం ఆ సంఖ్య రెట్టింపైంది. ఏకంగా 8, 561 మంది కరోనాకు గురయ్యారు. ఇక గురువారం11, 535 కొత్త కేసులు నమోదుకాగా 44 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఏకంగా 16, 055 మంది మహమ్మారి బారిన పడగా..25 శాతం మంది మరణించారు. కాగా కొత్త వేరియంట్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా 217 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో 26, 620 ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయని నివేదికలు చెబుతున్నాయి..

Also Read:

Corona-Omicron: ఒమిక్రాన్‌ వైరస్‌ను ఎదుర్కొనే కొత్త చికిత్స.. బ్రిటన్‌లో వైద్యుల ముందడుగు..!

Booster Dose: 40 ఏళ్లు దాటితే బూస్టర్ డోస్ తప్పనిసరి.. తేల్చి చెప్పిన ఇన్సాకోగ్ శాస్త్రవేత్తలు.. ఎప్పుడు ఇవ్వాలంటే?

Coronavirus: కళాశాలలో కరోనా కలకలం.. 56 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌..!