Coronavirus: కళాశాలలో కరోనా కలకలం.. 56 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్..!
Coronavirus: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి విజృంభిస్తోంది. విద్యార్థులను వెంటాడుతోంది. తాజాగా ఒడిశాలోని దెంకనల్ లో ఉన్న..
Coronavirus: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి విజృంభిస్తోంది. విద్యార్థులను వెంటాడుతోంది. తాజాగా ఒడిశాలోని దెంకనల్ లో ఉన్న ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 56 మంది విద్యార్థులకు పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ గా వచ్చిన వారందరినీ క్యాంపస్ లో క్వారంటైన్ లో ఉంచకుండా.. ఎవరి ఇంటికి వాళ్లను పంపేశారు కాలేజీ ప్రిన్సిపాల్. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.
ప్రిన్సిపల్‌పై కేసు నమోదు
పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు ఇంటికి పంపించడంపై అధికారులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కళాశాల ప్రిన్సిపల్, ఓనర్‌పై కేసు నమోదు చేశారు. 270 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా, 56 మందికి పాజిటివ్ తేలింది. దీనిపై స్పందించిన దెంకనల్ కమిషనర్.. బాధ్యతల లేకుండా వ్యవహరించడంపై మండిపడ్డారు. అలాగే మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమంత స్పందించారు. విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు ఎందుకు అనుమతించారని, ఇది బాధ్యతారాహిత్యం అని అన్నారు. నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్, ఓనర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని అన్నారు. కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తులందరినీ కూడా పరీక్షలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
గత వారం కూడా నలుగురు విద్యార్థులకు కోవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత బుధవారం 33 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత గురువారం మరో 19 మంది పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. అయితే క్యాంపస్‌ను సందర్శించినప్పుడు కాలేజీ అధికారులు కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించడం లేదని గుర్తించామని, జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను క్యాంపస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు అనుమతించినందుకు కళాశాల అధికారులకు షోకాజ్ నోటీసులు జార చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: