Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WHO on Omicron: వేగంగా విస్తరిస్తున్న ఓమిక్రాన్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన..!

ఇప్పడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖంపట్టి అన్ని వ్యవస్థలు గాడిలోపడుతున్న తరుణంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు.

WHO on Omicron: వేగంగా విస్తరిస్తున్న ఓమిక్రాన్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన..!
Omicron
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 04, 2021 | 7:40 AM

WHO on Omicron: ఇప్పడిప్పుడే కరోనా మహమ్మారి తగ్గుముఖంపట్టి అన్ని వ్యవస్థలు గాడిలోపడుతున్న తరుణంలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు. COVID-19 కొత్త వేరియంట్ వైరస్ మునుపటి కంటే వేగంగా వ్యాపిస్తుంది. కానీ భయాందోళనలకు గురికావల్సిన పనిలేదని స్పష్టం చేసింది. WHOకి తెలిసినంతవరకు, Omicron వేరియంట్ ఎటువంటి మరణాలకు దారితీయలేదని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త వెల్లడించారు. అయితే సౌమ్య స్వామినాథన్ దక్షిణాఫ్రికా నుండి సేకరించిన డేటా గురించి ప్రజలు ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు.

తొలుత ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్లు వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలో మొత్తం కేసులను మూడు మిలియన్లు దాటాయి. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో సహా ఇప్పటికి 30కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు (Cases) నమోదయ్యాయి. దాని లక్షణాలు, తీవ్రత, సంక్రమణ వేగం వంటి అంశాలపై ఇంకా సమగ్ర విషయాలు వెల్లడి కాకపోవడంతో ఈ ఆందోళనలు మరింత అధికం అవుతూనే ఉన్నాయి. ఈ వేరియంట్ ఎంత అంటువ్యాధి, అది మరింత తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందా, దానికి వ్యతిరేకంగా చికిత్సలు, టీకాలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో తెలుసుకోవడానికి కొన్ని వారాలు పట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.కానీ, ఈ వేరియంట్ కారణంగా ఇప్పటి వరకు ఒక్కరూ మరణించినట్టు తమకు రిపోర్టులు రాలేవని వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ గురించిన సమాచారాన్ని ఆ వేరియంట్ వ్యాప్తి చెందిన దేశాలన్నింటి నుంచి సేకరిస్తున్నట్టు ఆ సంస్థ వివరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పోక్స్‌మన్ క్రిస్టియన్ లిండ్‌మెయిర్ ఈ రోజు జెనీవాలో విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మరణించినట్టు తాను ఒక్క రిపోర్టునూ ఇప్పటి వరకు చూడలేదని ఆయన అన్నారు. ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో ఆందోళనలు కలిగిస్తున్నదని తెలిపారు. అయితే, 60 రోజుల నుంచి అందిన సమాచారం ప్రకారం 99.8శాతం జీనోమ్ సీక్వెన్స్ వివరాలు కేవలం డెల్టా వేరియంట్ కేసులనే వెల్లడించాయని అన్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండవచ్చనని, వేగంగా ఇప్పుడు ఒక దేశం నుంచి మరొక దేశానికి వ్యాప్తి చెందుతూ ఉండవచ్చునని తెలిపారు. ఒక దశలో ఇప్పుడు ప్రబలంగా ఉన్న వేరియంట్‌నూ దాటి పోవచ్చునని అన్నారు. కానీ, ఇప్పుడైతే అధిక తీవ్రత, ప్రభావం చూపిస్తున్న వేరియంట్ మాత్రం డెల్టానే అని వెల్లడించారు.

రెండు వారాల ముందు ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలను ఆయన పేర్కొన్నారు. కొన్ని దేశాలు మొత్తం తమ ఆర్థిక కార్యకలాపాలను మూసేసుకున్నాయని అన్నారు. మరికొన్ని దేశాల్లో చాలా చోట్ల లాక్‌డౌన్‌లు విధించాయని, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ మార్కెట్‌లనూ మూసేశారని తెలిపారు. అయితే, ఈ ఆంక్షలు అన్ని కూడా ఒమిక్రాన్ వేరియంట్ రాకకు ముందేనని వివరించారు. ఎందుకంటే డెల్టా కేసులు పెరుగుతున్నందున ఈ ఆంక్షలు విధించారని చెప్పారు. కాబట్టి, ఈ విషయాన్ని మరిచిపోవద్దని తెలిపారు.

ఇదిలావుంటే, ఓమిక్రాన్‌కు సంబంధించిన మరణాల ఇంకా చూడలేదని WHO శుక్రవారం తెలిపింది. అయితే, కొత్త వేరియంట్ వ్యాప్తి రాబోయే కొద్ది నెలల్లో యూరప్‌లోని కోవిడ్ కేసులలో సగానికి పైగా సంభవించవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. డెల్టా స్ట్రెయిన్ మాదిరిగానే కొత్త వేరియంట్ కూడా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను మందగించగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ క్రిస్టాలినా జార్జివా శుక్రవారం తెలిపారు. “ఈ కొత్త వేరియంట్ రాకముందే, రికవరీ కొనసాగుతుండగా, కొంత ఊపందుకుంటున్నదని మేము ఆందోళన చెందాము” అని ఆమె చెప్పారు. “చాలా వేగంగా వ్యాపించే కొత్త వేరియంట్ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.” అని ఆమె పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాలోని పరిశోధకుల ప్రాథమిక అధ్యయనంలో, ఈ వేరియంట్ నవంబర్ 24న మొదటిసారిగా నివేదించబడింది, డెల్టా లేదా బీటా జాతులతో పోలిస్తే ఇది రీఇన్‌ఫెక్షన్‌లకు కారణమయ్యే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అని సూచిస్తుంది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి భిన్నమైన ముక్కులుగా సమాచారం వస్తున్నదని, వీటన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, అవలంభించాల్సిన పద్ధతులపై నిపుణులు ఒక అభిప్రాయానికి రావల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ఏం చెబుతున్నదంటే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని పేర్కొంటున్నదని తెలిపారు.

Read Also….. Nirmala Sitharaman : అందుకే సాగు చట్టాలను ఉపసంహరించుకున్నాం.. యూపీలో మళ్లీ బీజేపీదే విజయం.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌..