National Housing Bank Jobs: నేషనల్ హౌజింగ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
National Housing Bank Recruitment 2021: నేషనల్ హౌజింగ్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...
National Housing Bank Recruitment 2021: నేషనల్ హౌజింగ్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో పోస్టులు ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైన విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.
* అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు, అలాగే డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 200 మార్కులకు గాను ఆబ్జెక్టివ్, 30 మార్కులకు డిస్క్రిప్షన్ ప్రశ్నాపత్రం ఉంటుంది.
* ఎంపికై అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 60 వేల నుంచి రూ. 1,26,954 వరకు పొందే అవకాశం ఉంది.
* దరఖాస్తుల స్వీకరణకు 30-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: LIC: ఎల్ఐసీ పాలసీతో పాన్ లింక్ చేసుకున్నారా.. లేకుంటే వెంటనే చేసుకోండి.. ఎందుకంటే..