బాలీవుడ్‌లో విషాదం.. మీర్జాపూర్‌ నటుడి అనుమానాస్పద మృతి !.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం..

హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. 'మీర్జాపూర్‌' సిరీస్‌తో పాటు 'సూపర్‌30', 'దంగల్‌' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా అనుమానాస్పదంగా మృతి చెందాడు..

బాలీవుడ్‌లో విషాదం.. మీర్జాపూర్‌ నటుడి అనుమానాస్పద మృతి !.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం..
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2021 | 9:48 AM

హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ‘మీర్జాపూర్‌’ సిరీస్‌తో పాటు ‘సూపర్‌30’, ‘దంగల్‌’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ముంబయిలోని వర్సోవా సోసైటీలో అద్దెకుంటున్న ఓ గదిలో అతని కుళ్లిపోయిన మృతదేహం లభించింది. ‘మీర్జాపూర్’ సిరీస్‌లో మున్నా భాయ్ (దివ్యేందు) అనుచరుడు ‘లలిత్‌’ పాత్రలో నటించాడు బ్రహ్మ స్వరూప్‌. తనదైన కామెడీ పండించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు. అదేవిధంగా పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రహ్మ స్వరూప్‌ గత 4 ఏళ్లుగా వర్సోవా సొసైటీలోనే నివాసముంటున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి అతను ఇంటినుంచి బయటకి రాలేదని స్థానికులు తెలుపుతున్నారు. బుధవారం అతను అద్దెకుంటున్న గది నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు.

మన లలిత్‌ ఇక లేడు.. కాగా సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి ఇంటికి తాళం వేసి ఉంది. డూప్లికేట్‌ తాళం సహాయంతో ఇంటి తలుపును తెరిచిన పోలీసులకు బ్రహ్మస్వరూప్‌ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌లో నివసించే అతడి సోదరుడు సందీప్‌కి సమాచారం అందించారు . కాగా బ్రహ్మ స్వరూప్ గుండెపోటుతో మరణించాడని, రూమ్ లో ఒక్కడే ఉండడంతో ఎవరికి ఈ విషయం తెలియలేదని, దాదాపు మూడురోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాగా మిశ్రా మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘మీర్జాపూర్‌’తో అతనితో కలిసి నటించిన దివ్యేందు శర్మ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపాడు. మిశ్రాతో కలిసున్న ఫొటోను పంచుకుంటూ ‘ మన లలిత్‌ ఇక లేడు. బ్రహ్మ స్వరూప్‌ మిశ్రా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం’ అని నివాళి తెలిపాడు.

View this post on Instagram

A post shared by Divyenndu ? (@divyenndu)

Also Read:

Konidela Upasana: ట్రాన్స్‌జెండర్లకు థ్యాంక్స్‌ చెప్పిన కొణిదెల వారి కోడలు.. ఎందుకంటే..

Samantha: సోషల్ మీడియాలో సమంత సెన్సేషన్.. అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..

Balakrishna Akhanda: బాలయ్య కు కంగ్రాట్స్ చెప్పిన jr.ఎన్టీఆర్ , మహేష్ బాబు.. రికార్డ్స్ బద్దలుకొడుతున్న చేస్తున్న అఖండ.. (వీడియో)