చారడేసి కళ్లతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నరి ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది.. ఎవరో గుర్తుపట్టారా..?

ఒకే ఒక్క సినిమా ఓవర్ నైట్ లో తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది ఈ అమ్మడిని.. ఒక్క సినిమాతోనే కుర్రకారు కలలరాకుమారిగా మారిపోయింది ఈ చిన్నది..

చారడేసి కళ్లతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నరి ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది.. ఎవరో గుర్తుపట్టారా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 03, 2021 | 10:10 AM

ఒకే ఒక్క సినిమా ఓవర్ నైట్ లో తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది ఈ అమ్మడిని.. ఒక్క సినిమాతోనే కుర్రకారు కలలరాకుమారిగా మారిపోయింది ఈ చిన్నది.. పై ఫొటోలో ఎంతో క్యూట్‌గా.. ముద్దులొలుకుతున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. చిన్నప్పుడు ఎంత అందంగా ఉందొ ఇప్పుడు అంతకు రెట్టింపు అందంతో ఆకట్టుకుంటుంది. చీరకట్టులో ఎంతో సంస్కారంతో నమస్కారం చేస్తున్న ఈ చిన్నారి తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది.. అదికూడా రీసెంట్ గానే.. సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటుంది.. తెలుగు లో కంటే ముందు కన్నడ సినిమాల్లో నటించింది ఈ వయ్యారి భామ ఇప్పటికైనా గుర్తొచ్చిందా..? ఈ ముద్దుగుమ్మ ఎవరంటే..

టాలీవుడ్ లో కొత్త అందాలకు కొదవే లేదు.. ఈ అమ్మడు కూడా టాలీవుడ్ కు అలానే వచ్చింది.. ఈ బ్యూటీ ఎవ్వరో కాదు.. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్ళిసందడి హీరోయిన్ శ్రీలీల. కన్నడ లో పలు సినిమాల్లో నటించిన శ్రీలీల పెళ్ళిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. అవవడానికి తెలుగమ్మాయి అయిన శ్రీలీల కర్ణాటకలో సెటిల్ అయ్యారు. కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్ళిసందడి సినిమా తో మంచి క్రేజ్ సొంతంచేసుకుంది శ్రీలీల. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో శ్రీలీలకు తెలుగులో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది. త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Shreeleela

Sreeleela (11)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Gold Price Today: స్థిరంగా కొనసాగుతోన్న బంగారం ధరలు.. ఆ రెండు చోట్ల మాత్రం భారీగా తగ్గుదల.. ఒమిక్రాన్ భయాలతోనేనా?

Chiranjeevi: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగా154 షూటింగ్‌.. సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి..

Akhanda Team – AMB Cinemas: అఖండ సక్సెస్.. బాలయ్య నోట అదిరిపోయే డైలాగ్.. వింటే గూస్‌బమ్స్ రావాల్సిందే..!