Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగా154 షూటింగ్‌.. సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి..

మెగాస్టార్‌ చిరంజీవి స్పీడ్‌ మాములుగా లేదు. యువ హీరోల కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం 'ఆచార్య' షూటింగ్‌లో ఉన్న ఆయన ఇప్పటికే 'గాడ్‌ఫాదర్‌', 'భోళా శంకర్‌' సినిమాలను కూడా పట్టాలెక్కించారు.

Chiranjeevi: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగా154 షూటింగ్‌.. సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి..
Chiru
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2021 | 7:08 AM

మెగాస్టార్‌ చిరంజీవి స్పీడ్‌ మాములుగా లేదు. యువ హీరోల కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్‌లో ఉన్న ఆయన ఇప్పటికే ‘గాడ్‌ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’ సినిమాలను కూడా పట్టాలెక్కించారు. ఊటీలో ‘గాడ్‌ ఫాదర్‌’ షెడ్యూల్‌ పూర్తికాగా.. ఇటీవల హైదరాబాద్‌లో ‘భోళా శంకర్’ షూటింగ్‌ ప్రారంభమైంది. తాజాగా మెగాస్టార్‌ 154 ప్రాజెక్టు షూటింగ్‌ కూడా స్టార్ట్‌ అయింది. ఈ సినిమాకు బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం వహిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మొదటి రోజు మెగాస్టార్‌ సెట్‌లోకి అడుగుపెట్టారు.

గొప్ప ఆరంభం.. ఈ సందర్భంగా చిరుకి సీన్ వివరిస్తూ ఉన్న ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేసిన డైరెక్టర్‌ బాబీ ‘చిరంజీవి అన్నయ్య తొలిరోజు షూటింగ్‌లో మాతో జాయిన్‌ అయ్యారు. కొంచెం నెర్వస్‌గా ఉంది. ఒకేసారి ఉద్వేగం, ఉత్సాహం తన్నుకొస్తున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రయాణానికి గొప్ప ఆరంభం ఇది’ అని రాసుకొచ్చారు. అయితే ఈ ఫొటోలో చిరు ఫేస్ కనిపించకపోవడంతో మెగా అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. కాగా చిరు, చరణ్‌ల కాంబినేషన్‌లో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

Akhanda Team – AMB Cinemas: అఖండ సక్సెస్.. బాలయ్య నోట అదిరిపోయే డైలాగ్.. వింటే గూస్‌బమ్స్ రావాల్సిందే..!

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Omicron: 1963లోనే ఓమిక్రాన్ పెద్ద సెన్సేషన్.. ఆర్జీవి సంచలన ట్వీట్..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..