Akhanda Team – AMB Cinemas: అఖండ సక్సెస్.. బాలయ్య నోట అదిరిపోయే డైలాగ్.. వింటే గూస్‌బమ్స్ రావాల్సిందే..!

Akhanda Team - AMB Cinemas: నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Akhanda Team - AMB Cinemas: అఖండ సక్సెస్.. బాలయ్య నోట అదిరిపోయే డైలాగ్.. వింటే గూస్‌బమ్స్ రావాల్సిందే..!
Balayya
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 03, 2021 | 5:22 AM

Akhanda Team – AMB Cinemas: నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సింహ, లెజెండ్ సినిమాల తరువాత అలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్న బాలకృష్ణ అభిమానులకు అఖండ తో మాస్ జాతర చూపించారు. అఖండ సినిమా థియేటర్లలో విడుదల అవడంతో ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో బాలయ్య అభిమానులు సందడి చేస్తున్నారు. అయితే, హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో అఖండ సినిమాను చూశారు నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, తమన్ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి, చిత్ర యూనిట్. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.

అఖండ విజయం పరమానందంగా ఉందని బాలకృష్ణ అన్నారు. ‘‘ఒక చరిత్ర కళ్ళ ముందు వున్నట్టు వుంది. అఖండ సినిమాని చక్కగా చెక్కిన శిల్పి బోయపాటి. కొన్నాళ్ళు భక్తిని రామారావు గారు బ్రతికించారు.. ఇప్పుడు అఖండ సినిమా. ఇది చలన చిత్ర పరిశ్రమ విజయం. యావత్ ఇండస్ట్రీ ఎదురు చూసింది. ఆధునిక జీవనశైలిలో భగవత్ చింతన మారింది. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించాలి అన్నా మేమే దాన్ని తిరగ రాయాలి అన్న మేమే. ఈ సినిమాలో ఎది ఎంత వుండాలో అంతే వుంది. పనినే మేము నమ్ముకుంటాము.. ఇండస్ట్రీనే నమ్ముకుంటాము.. నేను ఒక డైరెక్టర్ ఆర్టిస్టుని.’’ అని అన్నారు బాలయ్య. చివరగా కరోనా కొత్త వేరియంట్ ప్రబలతున్న నేపథ్యంలో ప్రజలకు పలు జాగ్రత్తలు, సూచనలు చేశారు బాలకృష్ణ. కరోనా వేరియంట్ కొత్తది రాబోతుందని, దానికి సిద్ధంగా ఉందామని అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘అందరి నుంచి ఓకే మాట వినిపిస్తోంది. సినిమా సూపర్ హిట్ అని. చాలా హ్యాపీగా వుంది. ఇది మా విజయం కాదు ఇండస్ట్రీ విజయం. ఈ విజయం ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను.’ అని అన్నారు. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సినిమా హిట్ అవ్వాలి అని కోరుకుంది. తెలుగు సినిమా అభిమానులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాను.’ అని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ. ‘అఖండ ని మోడరన్ గా చూపించాలి అని చాలా హోమ్ వర్క్ చేశాం. శివుడు గురించి యూత్ కూడా వినేలా వుండాలి అని ఎంతో కష్ట పడి చేశాం. ఈ సినిమాని మాస్ జాతర చేశారు. బాలయ్యకు హిట్ వస్తె ఇండస్ట్రీకి వచ్చినట్టు. బాలకృష్ణ లాంటి హ్యుమన్ బీయింగ్‌తో పని చెయ్యడం చాలా సంతోషంగా వుంది.’ అని అన్నారు.

ఇదిలాఉంటే.. ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ అవడంపై నందమూరి తారక రామారావు(జూనియర్) స్పందించారు. ట్విట్టర్ వేదికగా బాబాయ్ బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అఖండ సినిమాను చూశాను. అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు బాలా బాబాయ్‌కి, చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి పండుగలాంటి క్షణాలు ఇవి.’ అని పేర్కొన్నారు.

Also read:

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్