Konidela Upasana: ట్రాన్స్‌జెండర్లకు థ్యాంక్స్ చెప్పిన కొణిదెల వారి కోడలు.. ఎందుకంటే..
మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ సతీమణి గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కొణిదెల ఉపాసన. అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించిన 'అపోలో లైఫ్'కు వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న ఆమె పలు సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తోంది
మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ సతీమణి గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కొణిదెల ఉపాసన. అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించిన ‘అపోలో లైఫ్’కు వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న ఆమె పలు సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పక్షులు, జంతువుల వంటి మూగ జీవాల సంరక్షణ పద్ధతులు, పౌష్టికాహారం, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంది. తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాల గురించి నిర్మోహమాటంగా మాట్లాడే ఉపాసన.. తాజాగా తన ట్రాన్స్‌జెండర్ ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు.. ఆ కమ్యూనిటీ గ్రూప్‌పై ప్రశంసలు కురిపించింది.
ప్రస్తుతం ఉపాసన ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఆమె సోదరి అనుష్ పాలా మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలెక్కనుంది. ప్రస్తుతం ప్రి వెడ్డింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలను చూస్తుంటే తన సోదరి ప్రి వెడ్డింగ్ వేడుకలకు ట్రాన్స్ జెండర్లను ఆహ్వానించినట్టు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్లతో ఆశీర్వాదం తీసుకోవడం, వారితో సరదాగా కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఉపాసన.. ‘ నా సోదరి (అనుష్ పాల) పెళ్లి వేడుకలను ప్రారంభించినందుకు నా ఫ్రెండ్ లక్ష్మీ నారాయణ్‌కు కృతజ్ఞతలు. జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా బతకాలో నువ్వు నేర్పించావ్.. హైద్రాబాద్ ట్రాన్స్ జెండర్ ఎథ్నిక్ కమ్యూనిటీ పై నాకు అపారమైన గౌరవం ఉంది. ఈ కమ్యూనిటీలోని ప్రతీ ఒక్కరి వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. వారితో ఇంత సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ఉపాసన రాసుకొచ్చింది.
View this post on Instagram
Also read:
Bigg Boss 5 Telugu: హౌస్‌లో హగ్గుల జాతర.. రొమాన్స్‌తో రచ్చ చేస్తున్న సిరి-షణ్ముఖ్
Chiranjeevi: హైదరాబాద్‌లో ప్రారంభమైన మెగా154 షూటింగ్.. సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి..