LIC: ఎల్ఐసీ పాలసీతో పాన్ లింక్ చేసుకున్నారా.. లేకుంటే వెంటనే చేసుకోండి.. ఎందుకంటే..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) డిమ్యాట్ ఖాతా ఉన్న తన పాలసీ హోల్డర్‌లను పాన్‌ కార్డుతో పాలసీని లింక్ చేయమని కోరింది. తద్వారా వారు తమ IPOలో రిజర్వ్ చేసిన కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది....

LIC: ఎల్ఐసీ పాలసీతో పాన్ లింక్ చేసుకున్నారా.. లేకుంటే వెంటనే చేసుకోండి.. ఎందుకంటే..
Lic
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 03, 2021 | 9:46 AM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) డిమ్యాట్ ఖాతా ఉన్న తన పాలసీ హోల్డర్‌లను పాన్‌ కార్డుతో పాలసీని లింక్ చేయమని కోరింది. తద్వారా వారు తమ IPOలో రిజర్వ్ చేసిన కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. ఇంకా డిమ్యాట్ ఖాతా లేని ఖాతా తెరిచి పాన్ లింక్ చేసుకోవచ్చని చెప్పింది. రాబోయే కొద్ది నెలల్లోనే ఎల్ఐసీ IPO గా రానుంది. దాదాపు రూ. 18,300 కోట్ల విలువైనPaytm ఐపీవో కంటే ఇది పెద్దది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం LIC చట్టం1956ను సవరించింది. ఎల్ఐసీ IPO కోసం వెళ్లినప్పుడు కంపెనీ తన పాలసీదారులకు వాటాలను అందించడానికి అనుమతించింది. తమ పాలసీలను వారి పాన్‌ ఎలా లింక్ చేయవచ్చో ప్రకటన కూడా చేసింది.

PAN-LIC లింక్ అయిందో లేదా చూసుకోండిలా..

1. https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus వెబ్‎సైట్‎కు వెళ్లాలి. 2. పాలసీ నంబర్, పుట్టిన తేదీ,పాన్ సమాచారం, అలాగే క్యాప్చా నమోదు చేయాలి. తర్వాత సబ్‌మిట్ బటన్‌ను నొక్కండి.

మీ పాన్ ఎల్‌ఐసీ డేటాబేస్‌లో లేకుంటే, ఎల్‌ఐసీతో మీ పాన్ వివరాలను ఎలా అప్‌డేట్ చేయవచ్చో చూద్దాం..

1. అధికారిక LIC వెబ్‌సైట్ https://licindia.in/ వెళ్లాలి లేదా నేరుగా https://linkpan.licindia.in/UIDSeedingWebApp/ వెళ్లొచ్చు 2. హోమ్ పేజీలో ‘ఆన్‌లైన్ పాన్ రిజిస్ట్రేషన్’ ఎంపికను ఎంచుకోండి. 3. ఆన్‌లైన్ పాన్ రిజిస్ట్రేషన్ పేజీలో ‘ప్రొసీడ్’పై క్లిక్ చేయండి. 4. మీ ఇమెయిల్ చిరునామా, PAN, మొబైల్ నంబర్,LIC పాలసీ నంబర్‌ను సరిగ్గా అందించండి. 5. బాక్స్‌లో క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి. 6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గేట్ OTPపై క్లిక్ చేయండి. 7. మీరు OTPని స్వీకరించిన తర్వాత, పోర్టల్‌లో అంకెలను ఇన్‌పుట్ చేసి సమర్పించండి.

మీరు LIC ఏజెంట్‌ను కూడా సంప్రదించవచ్చు. మీకు పాన్ లేకపోతే, వీలైనంత త్వరగా ఒకదాని కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

Read Also.. Geetha Gopinath: IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా భారతీయ-అమెరికన్.. గొప్ప అవకాశమన్న గీతా గోపీనాథ్..