Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సప్‎లో ఉబర్ రైడ్ బుక్ చేసుకోవచ్చు.. మొదటగా అక్కడ ప్రారంభం..

వాట్సాప్ ద్వారా ఉబెర్ రైడ్‌లను బుక్ చేసుకోవడానికి ఉబర్-వాట్సాప్ ​జతకట్టాయి. దీంతో ప్రజలు ఉబర్​ యాప్ ​డౌన్ ​లోడ్​ చేసుకోవాల్సిన పని లేకుండానే. రిజిస్ట్రేషన్​ నుంచి, రైడ్​ బుకింగ్​, ట్రిప్​ రిసీట్​ వరకు అన్ని వాట్సాప్​లోనే చూసుకోవచ్చు...

WhatsApp: వాట్సప్‎లో ఉబర్ రైడ్ బుక్ చేసుకోవచ్చు.. మొదటగా అక్కడ ప్రారంభం..
Uber
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 03, 2021 | 10:32 AM

వాట్సాప్ ద్వారా ఉబెర్ రైడ్‌లను బుక్ చేసుకోవడానికి ఉబర్-వాట్సాప్ ​జతకట్టాయి. దీంతో ప్రజలు ఉబర్​ యాప్ ​డౌన్ ​లోడ్​ చేసుకోవాల్సిన పని లేకుండానే. రిజిస్ట్రేషన్​ నుంచి, రైడ్​ బుకింగ్​, ట్రిప్​ రిసీట్​ వరకు అన్ని వాట్సాప్​లోనే చూసుకోవచ్చు. దీంతో బుకింగ్​ సదుపాయం మరింత సులభం కానుంది. ఉత్తర ప్రదేశ్‎లోని లక్నో ఈశాన్య ప్రాంతంలో దీనిని పైలట్​ ప్రాజెక్టు కింద చేపట్టనున్నారు. అనంతరం వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు త్వరలోనే విస్తరించనున్నారు.

భారతీయులందరూ Uberను బుక్ చేసుకోవడానికి మేము వీలైనంత సులభతరం చేయాలనుకుంటున్నామని Uber బిజినెస్ డెవలప్‌మెంట్ సీనియర్ డైరెక్టర్ నందిని మహేశ్వరి అన్నారు. అలా చేయడానికి మేము వారికి సౌకర్యవంతంగా ఉండే ప్లాట్‌ఫారమ్‌లతో కలవాలని అనుకున్నామని చెప్పారు. “వాట్సాప్‌లోని ఉబెర్ అనుభవం సరళమైనది, సుపరిచితమైనది.” అని వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ తెలిపారు. ఇండియాలో వాట్సాప్‎కు 500 మిలియన్లకు పైగా యూజర్స్ ఉన్నారని.. వారందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. బేస్‌లోకి ప్రవేశించడానికి Uber ఈ రకమైన మొదటి ఏకీకరణ సహాయం చేస్తుంది. Uber గత ఎనిమిది సంవత్సరాలుగా ఆసియా దేశంలో పనిచేస్తోంది మరియు ఇప్పుడు 70 నగరాల్లో అందుబాటులో ఉంది.

ఎలా బుక్​ చేసుకోవాలి? మొదటగా వాట్సాప్​ నుంచి ఉబర్​ బిజినెస్​ ఖాతా నెంబర్‎​కు మెసేజ్​ చేయాలి. ఆ తర్వాత క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేయాలి. లేదా ఉబర్​ వాట్సాప్​ చాట్​ కోసం ఏర్పాటు చేసిన లింక్‎​ను క్లిక్​ చేయాలి. పిక్​అప్​, డ్రాప్​ లొకేషన్​ వివరాలు టైప్​ చేయాలి. ఆ తర్వాత డ్రైవర్​ సమాచారం తదితర వివరాలు వాట్సాప్‎​లో వస్తాయి. రైడ్​ మధ్యలో మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే వాట్సాప్​ లొకేషన్​ద్వారా చూసుకోవచ్చు. భద్రతాపరమైన అంశాల కోసం ‘ఎమర్జెన్సీ’ ఆప్షన్​ను కూడా ఏర్పాటు చేశారు. అది ప్రెస్​ చేస్తే.. ఉబర్​ కస్టమర్​ సపోర్ట్​ బృందం నుంచి వెంటనే ఫోన్​ వస్తుంది.

Read Also… LIC: ఎల్ఐసీ పాలసీతో పాన్ లింక్ చేసుకున్నారా.. లేకుంటే వెంటనే చేసుకోండి.. ఎందుకంటే..