AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Inter Admissions 2024: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి అన్ని రకాల కాలేజీల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశాల గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన వెలువరించింది. జులై 31వ తేదీ వరకు ఇంటర్‌ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ గడువు తేదీని పొడిగించారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా జూన్‌ 28న తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు..

TG Inter Admissions 2024: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే..
TG Inter Admissions
Srilakshmi C
|

Updated on: Jun 30, 2024 | 4:08 PM

Share

హైదరాబాద్‌, జూన్‌ 30: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి అన్ని రకాల కాలేజీల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశాల గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన వెలువరించింది. జులై 31వ తేదీ వరకు ఇంటర్‌ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ గడువు తేదీని పొడిగించారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా జూన్‌ 28న తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. జూన్‌ 3 నుంచి 11 వరకు జరిగిన పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ ఏడాది మొత్తం 51,237 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో బాలురు 31,625 మంది, బాలికలు 19,612 మంది ఉన్నారు.

సప్లిమెంటరీ పరీక్షల్లో 73.03 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. వీరందరికీ ప్రవేశాలు పొందేందుకు తగిన సమయం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫస్టియర్‌ జనరల్, ఒకేషనల్ కోర్సుల ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుంది. పదో తరగతి గ్రేడు, రిజర్వేషన్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

నవోదయ 11వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 11వ తరగతిలో సీట్ల భర్తీ (లేటరల్‌ ఎంట్రీ)కి సంబంధించి నిర్వహించిన జేఎన్‌వీ లేటరల్‌ ఎంట్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఫలితాలు తెలసుకోవచ్చు. ఈ పరీక్షలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా మొత్తం 650 నవోదయ విద్యాలయాలు ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..