Inter Admissions: విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్‌లో ప్రవేశాలకు మరోసారి అవకాశం.. చివరి తేదీ ఎప్పుడంటే..

విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడించింది.. ఈ క్రమంలో తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీల‌క ప్రకటన చేసింది. ఇంట‌ర్ ప్రవేశాల గడువును మ‌రోసారి పొడిగిస్తూ ఇంట‌ర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Inter Admissions: విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్‌లో ప్రవేశాలకు మరోసారి అవకాశం.. చివరి తేదీ ఎప్పుడంటే..
Students
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 21, 2022 | 12:53 PM

Telangana Inter Admissions: విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడించింది.. ఈ క్రమంలో తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీల‌క ప్రకటన చేసింది. ఇంట‌ర్ ప్రవేశాల గడువును మ‌రోసారి పొడిగిస్తూ ఇంట‌ర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రవేశాలు జూన్‌లో మొదలు కాగా.. పలుమార్లు గడువును పొడిగించిన బోర్డు.. చివరకు అక్టోబరు 15వ తేదీకి ముగించింది. ఈ క్రమంలో తెలంగాణ‌లోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో ఫ‌స్టియ‌ర్‌లో ప్రవేశాలకు మ‌రోసారి అవ‌కాశం క‌ల్పించనున్నట్లు పేర్కొంది. అర్హత గ‌ల విద్యార్థులు న‌వంబ‌ర్ 27వ తేదీ వ‌ర‌కు ఆయా కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే, ఇప్పటి వరకు 3.50 లక్షల మంది విద్యార్థుల పేర్లే ఇంటర్ బోర్డు లాగిన్‌ పరిధిలోకి వచ్చాయి. వారికి మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించేందుకు అర్హత ఉంటుంది. ఈ క్రమంలో ఇంట‌ర్ ప‌బ్లిక్ ఎగ్జామ్స్‌కు సంబంధించి ప‌రీక్ష ఫీజు స్వీకరణ కూడా కొన‌సాగుతుంది. న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష ఫీజు గడువుగా పేర్కొంది. దాదాపు లక్ష నుంచి లక్షన్నర మంది అడ్మీషన్స్ బోర్డు ఆన్‌లైన్‌లోకి ఎక్కకపోవడంతో.. యాజమాన్యాలకు లాగిన్‌ అయ్యే అవకాశం లేకపోవడంతో విద్యార్థుల కోసం ఈ గడువును మరోసారి పెంచినట్లు తెలుస్తోంది.

పరీక్ష ఫీజు చెల్లింపు గడువు..

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు న‌వంబ‌ర్ 30వ తేదీ గా బోర్డు పేర్కొంది. ఇంట‌ర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం చ‌దువుతున్న విద్యార్థుల‌తో పాటు గ‌తంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేష‌న‌ల్ కోర్సుల విద్యార్థులు ప‌రీక్ష ఫీజు చెల్లించవ్చు. వ‌చ్చే ఏడాది మార్చిలో ఇంట‌ర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇంట‌ర్ రెగ్యుల‌ర్ విద్యార్థులు రూ. 500 ప‌రీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంట‌ర్ ద్వితీయ సంవత్సరం చ‌దువుతున్న సైన్స్ గ్రూపుల విద్యార్థులు ప్రాక్టిక‌ల్ పరీక్షల కోసం అద‌నంగా రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేష‌న‌ల్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.710 చెల్లించాలి.

ఇవి కూడా చదవండి

రూ. 100 ఆల‌స్యం రుసుంతో డిసెంబ‌ర్ 2 నుంచి 6వ తేదీ మధ్యలో పరీక్ష ఫీజు చెల్లించొచ్చు. రూ. 500 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 8 నుంచి 12వ తేదీ వరకు చెల్లించొచ్చు. రూ. 1000 ఆల‌స్య రుసుంతో డిసెంబర్ 14 నుంచి 17వ తేదీ వ‌ర‌కు, రూ. 2000 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 19 నుంచి 22వ తేదీ వరకు ఇంటర్ విద్యార్థులు పరీక్ష పీజు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..