Papaya Water: ఆ సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే, బొప్పాయి నీళ్లను ట్రై చేయండి.. వెంటనే పరిష్కారం..

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంది. అందుకే బొప్పాయి డెంగ్యూకు దివ్యౌషధంగా పరిగణిస్తారు.

Papaya Water: ఆ సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే, బొప్పాయి నీళ్లను ట్రై చేయండి.. వెంటనే పరిష్కారం..
Papaya Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 19, 2022 | 12:59 PM

Health Benefits of Papaya Water: బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంది. అందుకే బొప్పాయి డెంగ్యూకు దివ్యౌషధంగా పరిగణిస్తారు. బొప్పాయిలోని పోషకాలు డెంగ్యూ సమయంలో పడిపోయే ప్లేట్‌లెట్లను వేగంగా పెంచుతాయి. అందుకే చాలామంది బొప్పాయి, బొప్పాయి సలాడ్‌ను తింటుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా బొప్పాయి నీళ్లు తాగారా? బొప్పాయి నీరు మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి నీటిని ఎలా తయారు చేయాలి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బొప్పాయి నీరు ఆరోగ్య ప్రయోజనాలు..

బొప్పాయి మాదిరిగానే ఇందులోని నీటిలో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు దీన్ని క్రమం తప్పకుండా, సరైన పరిమాణంలో తీసుకుంటే ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు మన నుంచి దూరమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

బొప్పాయిలోని విటమిన్ సి మీ రోగనిరోధక వ్యవస్థ, చర్మం రెండింటికీ మేలు చేస్తుంది. దీన్ని ముఖానికి రాసుకుంటే డల్ నెస్ తొలగిపోయి చర్మం మెరుస్తుంది. అంతేకాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి రోజుకు కనీసం అర గ్లాసు బొప్పాయి నీటిని తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

బొప్పాయి నీటి తయారీ విధానం – వినియోగించే సమయం

సగం బొప్పాయి తీసుకుని దాని పై తొక్క, గింజలను తొలగించండి. శుభ్రం చేసిన బొప్పాయిని చిన్న ముక్కలుగా కోసి ఐదు నిమిషాలు నీళ్లలో ఉడకనివ్వాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల బొప్పాయి నీళ్లు తాగడానికి సిద్ధమవుతాయి. బొప్పాయి నీళ్లను సిద్ధం చేసి ఫ్రిజ్‌లో ఉంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగవచ్చు. ఇంకా.. మంచి నీళ్లలా అప్పుడప్పుడు కూడా తీసుకోవచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఉదయాన్నే బొప్పాయి నీటిని తాగొచ్చు. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోతుంది. ఇంకా శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మారిన వర్సిటీలు, కన్వీనర్లు..
ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు మారిన వర్సిటీలు, కన్వీనర్లు..
కొత్త సంవత్సరంలో రాజయోగం.. అదృష్టం అంటే ఈ రాశులవారిదే
కొత్త సంవత్సరంలో రాజయోగం.. అదృష్టం అంటే ఈ రాశులవారిదే
అభిమాని అడిగిన ప్రశ్నకు సీరియస్ అయిన విజయ్ సేతుపతి..
అభిమాని అడిగిన ప్రశ్నకు సీరియస్ అయిన విజయ్ సేతుపతి..
నర్సింగ్‌ కాలేజీల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలి
నర్సింగ్‌ కాలేజీల్లో అబ్బాయిలకు సైతం ప్రవేశాలు కల్పించాలి
కాకి బిర్యానీ కోసం 19 కాకులను చంపిన దంపతులు..
కాకి బిర్యానీ కోసం 19 కాకులను చంపిన దంపతులు..
ప్రపంచంలోకెల్లా ఏకైక బ్లూ సిటీ..! ఇదేదో గ్రీస్ దేశం అనుకునేరు..
ప్రపంచంలోకెల్లా ఏకైక బ్లూ సిటీ..! ఇదేదో గ్రీస్ దేశం అనుకునేరు..
ప్రాణంగా పెంచుకున్న కుక్క మృతి..ప్రతి ఏడాది దాన్ని జ్ఞాపకాల్లో..
ప్రాణంగా పెంచుకున్న కుక్క మృతి..ప్రతి ఏడాది దాన్ని జ్ఞాపకాల్లో..
కాంగ్రెస్‌కు గట్టి కౌంటరిచ్చిన ప్రధాని మోదీ
కాంగ్రెస్‌కు గట్టి కౌంటరిచ్చిన ప్రధాని మోదీ
రీల్స్‌ పిచ్చితో వెర్రీ వేషాలు..రోడ్డు వెంట నోట్ల కట్టలతో హల్‌చల్
రీల్స్‌ పిచ్చితో వెర్రీ వేషాలు..రోడ్డు వెంట నోట్ల కట్టలతో హల్‌చల్
ఓర్నీ.. ఆ ఫైనాన్స్‌ కంపెనీలు ఆత్మలకు కూడా లోన్లు ఇస్తాయా ??
ఓర్నీ.. ఆ ఫైనాన్స్‌ కంపెనీలు ఆత్మలకు కూడా లోన్లు ఇస్తాయా ??