Blood Sugar: హై షుగర్‌తో ఆందోళన చెందుతున్నారా.. ఇవి అద్భుతమైన డయాబెటిస్ ఆహారాలు..

మధుమేహం వ్యాధి ఉన్న వాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఈబ్లడ్ షుగర్ జీవితంలో మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అయితే ఇలాంటి సమయంలో వీరు తినదగినవి..

Blood Sugar: హై షుగర్‌తో ఆందోళన చెందుతున్నారా.. ఇవి అద్భుతమైన డయాబెటిస్ ఆహారాలు..
Blood Sugar Control Tips
Follow us

|

Updated on: Nov 19, 2022 | 8:34 PM

హై బ్లడ్ షుగర్ అనేది అక్షరాలా నిశ్శబ్ద వ్యాధి. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం అవసరం. ముఖ్యంగా ఆహారం విషయంలో బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినగలిగే 7 రకాల ఆహారాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం..

బాదం..

మధుమేహ బాధితులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాదం తినవచ్చు. అది కూడా ముందు రోజునే నీటిలో నాన బెట్టిన బాదంను పొట్టు తీసుకుని తినడం మంచిది. తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్‌తో పాటు ప్రోటీన్, మంచి కొవ్వులు, ఫైబర్‌తో నిండి ఉంటుంది. బాదం అధిక బ్లడ్ షుగర్ ఉన్నవారికి గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. రక్తంలో చక్కెరను తగ్గించే సామర్థ్యాన్ని కూడా దీనికి ఉంటుంది.

ధాన్యాలు 

జొన్నలు, సజ్జలు, తృణధాన్యాలు, మల్టీగ్రెయిన్, క్వినోవా, వోట్మీల్ వంటి తృణధాన్యాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న ఆహారం. GI సంఖ్య ఒక నిర్దిష్ట అంశం రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత పెంచుతుందో సూచిస్తుంది. కాబట్టి సహజంగా తక్కువ GI ఉన్న ఈ తృణధాన్యాలు అధిక రక్త చక్కెర ఉన్నవారికి అద్భుతమైనవి.

గుడ్డు

హై షుగర్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గుడ్లు సహాయపడుతాయి. గుడ్లు ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. గుడ్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. మంటను తగ్గిస్తాయి. పచ్చసొనలో చాలా పోషకాలు ఉన్నాయి. కాబట్టి మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి.

వేయించిన శనగలు (Roasted channa)

వేయించిన శనగలు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది అధిక బ్లడ్ షుగర్ ఉన్నవారికి వేయించిన శనగలు గొప్ప స్నాక్స్ అని చెప్పవచ్చు.

పండ్లు

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ అన్ని పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివి కావు. తక్కువ GI ఉన్న అనేక పండ్లు ఉన్నాయి. ఇందులో బెర్రీలు, రేగు పండ్లు, చెర్రీస్, ఆపిల్, నారింజ, కివీస్, అవకాడోలు ఉన్నాయి. సిట్రస్ ఉన్న పండ్లను తినవచ్చు. ఆకు పచ్చ రంగు కలిగిన, తీపి లేనటువంటివి మాత్రమే తినాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో