AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Toilet Day 2022: ఇండియన్ టాయిలెట్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది మంచిది?.. తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు..

మీ ఇంట్లో టాయిలెట్ సీట్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇండియన్ లేదా వెస్ట్రన్ టాయిలెట్ గురించి ఒక్కోసారి మనసులో గందరగోళం ఏర్పడతుంది. ఈ వార్త చదివిన తర్వాత మీ అలాంటి గందరగోళం నుంచి బయటకొస్తారు.

World Toilet Day 2022: ఇండియన్ టాయిలెట్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది మంచిది?.. తాజా పరిశోధనల్లో సరికొత్త విషయాలు..
World Toilet Day
Sanjay Kasula
|

Updated on: Nov 19, 2022 | 7:22 PM

Share

ప్రస్తుత కాలంలో  చాలా ఇళ్లలో వెస్ట్రన్ టాయిలెట్ వాడకం వేగంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగూనంగా అన్నింటిలో మార్పులు వస్తున్నాయి. ఆరోగ్య రక్షణ కోసం మరుగుదొడ్ల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జణ రహితంగా మార్చాలని ప్రభుత్వవాలు ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని ప్రత్యేక సప్సిడీతో నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. అయితే ఇందులో భాగంగా కొందరు ఇండియన్ టాయిలెట్‌ను ఇష్టపడుతుండగా.. మరికొందరు మాత్రం వెస్ట్రన్ టాయిలెట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఇందులో దేని ప్రయోజనాలు దానివి. అయితే ఇంట్లో టాయిలెట్ సీటు వేసుకునేటప్పుడు ఏ కమోడ్ పెట్టుకోవాలి అనే ఆలోచన మీ మదిలో మెదిలింది. ఈ ప్రశ్నపై నిపుణులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం..

ఇండియన్ టాయిలెట్..

ఇండియన్ టాయిలెట్‌లో స్క్వాట్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల పెల్విక్ ప్రోలాప్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్క్వాట్ పొజిషన్‌లో కూర్చున్నప్పుడు, మలాన్ని పూర్తిగా క్లియర్ చేయడానికి ప్రేగులపై ఒత్తిడి తెస్తుంది. ఇలా చేస్తే పొట్ట బాగా క్లీన్ అవుతుంది. ఈ స్థితిలో కూర్చోవడం వల్ల తొడలు, పెల్విక్ ప్రాంతాన్ని బలోపేతం చేస్తుంది. టాయిలెట్‌లో స్క్వాట్ పొజిషన్‌లో కూర్చున్నప్పుడు, వీపును నిటారుగా ఉంచండి. ఇది సమతుల్యతను కాపాడుతుంది. మీరు పడిపోకూండా జాగ్రత్త పడొచ్చు.

వెస్ట్రన్ టాయిలెట్..

వెస్ట్రన్ టాయిలెట్ షీట్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెస్ట్రన్ టాయిలెట్ ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మీరు దీన్ని చాలా ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో చూడవచ్చు.

ఏ టాయిలెట్ సీటు బెస్ట్..?!

  • ఒక వ్యక్తి ఇండియన్ టాయిలెట్‌ను ఉపయోగించినప్పుడు.. అతని కాలి నుంచి తల వరకు మొత్తం శరీరం ఒత్తిడికి గురవుతుందని ఒక పరిశోధనలో కనుగొనబడింది. అయితే వెస్ట్రన్ టాయిలెట్‌లో సౌకర్యవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. దాని కారణంగా వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు.
  • ఇండియన్ టాయిలెట్‌లో పొట్టను శుభ్రం చేయడానికి 3 నుంచి 3.5 నిమిషాలు పడుతుంది. అయితే వెస్ట్రన్ టాయిలెట్‌లో 5 నుండి 7 నిమిషాలు పడుతుంది. దీని తర్వాత కూడా.. మీ కడుపు సరిగ్గా శుభ్రం చేయబడదు.. ఎందుకంటే ఇండియన్ టాయిలెట్ ఉపయోగించడం వల్ల కడుపు, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వల్ల పొట్ట త్వరగా శుభ్రపడుతుంది.
  • ఇండియన్ టాయిలెట్‌తో పోలిస్తే వెస్ట్రన్ టాయిలెట్‌కి వెళ్లడం వల్ల మీ శరీరం ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది విరేచనాలు, పొట్టకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది. ఎందుకంటే వెస్ట్రన్ టాయిలెట్ సీటు మీ చర్మంతో సంబంధం కలిగి ఉంటుంది. చర్మసంబంధమైన కారణంగా జెర్మ్స్ మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి.
  • భారతీయ టాయిలెట్ గర్భధారణ సమయంలో మహిళలకు మంచిదని చెప్పబడింది. దీంతో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఇండియన్ టాయిలెట్ ఉపయోగించడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ సమాచారం మాత్రమే. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి)

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం