AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scooty Driving Video: ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద స్కూటీని ఆపడానికి ట్రై చేసి.. డ్రైన్ లో తలకిందులుగా పడిన యువతి.. ఫన్నీ వీడియో వైరల్

ఇప్పుడు ఆడవాళ్ళే కాదు పురుషులు కూడా స్కూటీ నడపడానికి ఇష్టపడుతున్నారు. అయితే తరచూ మహిళలు స్కూటీని డ్రైవ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో కూడా అలాంటి సంఘటనే కనిపిస్తుంది.

Scooty Driving Video: ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద స్కూటీని ఆపడానికి ట్రై చేసి.. డ్రైన్ లో తలకిందులుగా పడిన యువతి.. ఫన్నీ వీడియో వైరల్
Funnyvideo Viral
Surya Kala
|

Updated on: Nov 19, 2022 | 7:06 PM

Share

సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అవి కొన్ని ఫన్నీగా ఉంటే మరి కొన్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. ప్రజలు సాధారణంగా ఫన్నీ వీడియోలను మాత్రమే చూడటానికి ఇష్టపడతారు. నవ్వు నవ్వులు పూయించే ఇలాంటి వీడియోలు. సోషల్ మీడియా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ట్విట్టర్) అన్ని రకాల  ప్లాట్‌ఫారమ్‌లలో అలాంటి ఫన్నీ వీడియోలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో ఒకటి చాలా వైరల్ అవుతోంది.  తాజాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియో మాత్రం నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తూనే ఒకింత ఆలోచింపచేస్తుంది. స్కూటీ నడుపుతూ డ్రైవింగ్ చేస్తున్న ఓ మ్మాయి అకస్మాత్తుగా డ్రైన్‌లో పడిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్కూటీ నడపడం చాలా సులభం. ముఖ్యంగా బైక్‌తో పోల్చితే… స్కూటీ నడిపే సమయంలో యాక్సిలరేటర్, బ్రేక్‌లను మాత్రమే జాగ్రత్తగా చూసుకోవాలి. అదే  బైక్‌ అయితే  గేర్ ను కూడా కంట్రోల్ లో ఉంచుకోవాలి. ఈ కారణంగానే స్కూటీ నేడు మార్కెట్‌లో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆడవాళ్ళే కాదు పురుషులు కూడా స్కూటీ నడపడానికి ఇష్టపడుతున్నారు. అయితే తరచూ మహిళలు స్కూటీని డ్రైవ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో కూడా అలాంటి సంఘటనే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర రెడ్‌ సిగ్నల్‌ పడటంతో కొన్ని వాహనాలు ఆగి ఉన్నాయి. ఇంతలో బైక్ నడుపుతున్న మరో వ్యక్తి అదే లైన్ లో ఆగిఉన్న వాహనాల పక్కనే వచ్చి ఆగాడు.  ఈ క్రమంలోనే ఓ యువతి స్కూటీపై వచ్చి అక్కడ ఆగింది. అయితే తన ముందు ఉన్న బైక్ ను తాకకుండా ఉండేందుకు బ్రేక్‌ వేసి ఆపే క్రమంలో స్కూటీని నియంత్రించలేక… బైక్ మీద నుంచి  స్కూటీతో సహా కిందపడిపోయింది.. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ యువతి రోడ్డు పక్కన ఉన్న డ్రెయిన్‌లోకి నేరుగా తలకిందులుగా పడిపోయింది. అకస్మాత్తుగా యువతి అలా పడిపోవడంతో అందరూ షాక్‌ అయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి.. వైరల్ వీడియోలో స్కూటీ ఆగిన తర్వాత  ఆ యువతి తన పాదాలను కిందకి దింపి.. బైక్ ను బ్యాలెన్స్ చేస్తే సరిపోయేది.. అయితే అలా స్కూటీని బ్యాలెన్స్ చేయడంలో మిస్ అయ్యి డ్రైన్ లో పడిపోయింది. అక్కడ నిలబడి ఉన్న బైక్ రైడర్స్ అందరూ వెనక్కి తిరిగి ఆమె వైపు చూడటం ప్రారంభించారు. ఈ ఫన్నీ వీడియో @IamSuVidha అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయబడింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..