AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JIPMER Recruitment: జిప్‌మర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పుదుచ్చేరి, కరైకాల్‌లోని యూనిట్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సీనియర్‌ రెసిడెంట్ పోస్టులను..

JIPMER Recruitment: జిప్‌మర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
Jipmer Recruitment
Narender Vaitla
|

Updated on: Nov 20, 2022 | 6:46 PM

Share

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పుదుచ్చేరి, కరైకాల్‌లోని యూనిట్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సీనియర్‌ రెసిడెంట్ పోస్టులను రెగ్యులర్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగామ మొత్తం 136 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* అనస్తీషియాలజీ అండ్‌ క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ అండ్‌ ఎస్‌టీడీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్‌ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, జెరియాట్రిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, నియోనటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఓబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, ఆఫ్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సీఎంఆర్‌సీ, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, రేడియేషన్ అంకాలజీ, రేడియో-డయాగ్నోసిస్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ), ఎండీఎస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 31-01-2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 నుంచి రూ. 1,10,000 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 09-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* హాల్‌ టికెట్లను 16-12-2022 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాత పరీక్షను 18-12-2022 నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి