AP RGUKTలో మిగిలిపోయిన 119 సీట్లు.. ఆర్జీయూకేటీల చరిత్రలోనే తొలిసారి..

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు మూడు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఐతే ఈ ఏడాది మాత్రం దాదాపు..

AP RGUKTలో మిగిలిపోయిన 119 సీట్లు.. ఆర్జీయూకేటీల చరిత్రలోనే తొలిసారి..
AP RGUKT vacant seats
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 20, 2022 | 12:59 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు మూడు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఐతే ఈ ఏడాది మాత్రం దాదాపు 119 సీట్లు మిగిలిపోయాయి. మూడు కౌన్సెలింగ్‌లు పూర్తైనా ఇన్ని సీట్లు మిగిలిపోవడం ట్రిపుల్‌ఐటీల చరిత్రలోనే ఇదే తొలిసారికావడం విశేషం. సాధారణంగా ప్రతియేటా జులైలో నిర్వహించే మొదటి రెండు కౌన్సెలింగ్‌లలోనే సీట్లన్నీ భర్తీ అవుతాయి. ఈ ఏడాది మాత్రం నవంబరు వచ్చినా భారీగా సీట్లు మిగిలిపోయాయి.

కాగా ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. వీటిల్లో ఈ ఏడాది 119 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుడు క్యాంపస్‌లలో నాలుగోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించినా సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రవేశాలకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలనూ పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో అవి రావడానికి ఆలస్యమైంది. దీనికితోడు సంబంధిత అధికారుల కమిటీ 1:1 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలవాలని ప్రకటించారు. దీంతో కొంత జాప్యం చోటుచేసుకుంది. గతంలో పదో తరగతి ఫలితాలు వెలువడగానే మార్కుల జాబితా ఆర్జీయూకేటీకి చేరేది. అనంతరం మెరిట్‌ ఆధారంగా 1:3 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలిచేవారు. చాలావరకు మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్లన్నీ భర్తీ అయ్యేవి. మిగిలిన సీట్లకు రెండో విడతలో చేరిపోయేవారు.

ఈ ఏడాది ప్రవేశాలు మరింత ఆలస్యంకావడంతో అధికమంది విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో చేరారు. దీంఓ మూడో విడత కౌన్సెలింగ్‌ చేపట్టినా సీట్లు భారీ మొత్తంలో మిగిలిపోయాయి. ఈ క్రమంలో నాలుగోసారి కూడా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే, ఫీజులు కట్టి ప్రైవేటు కాలేజీల్లో చేరిన విద్యార్థులు తిరిగి వస్తారనే నమ్మకం అంతంతమాత్రంగానే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.