AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: అలర్ట్.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. గుండెపోటుకు సంకేతమే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. అత్యధిక మరణాలకు గుండెపోటు ప్రధాన కారకంగా మారిందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

Health Tips: అలర్ట్.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. గుండెపోటుకు సంకేతమే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
Heart Care
Shaik Madar Saheb
|

Updated on: Nov 20, 2022 | 9:46 AM

Share

ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. అత్యధిక మరణాలకు గుండెపోటు ప్రధాన కారకంగా మారిందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. గుండె సమస్యలతో బాధపడుతున్నవారు భారతదేశంలో కూడా చాలా మంది ఉన్నారు. మన దేశంలో ఆయిల్ ఫుడ్ తినే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. దీంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతోంది. ఇలా జరగడం వల్ల ధమనులలో అడ్డంకులు ఏర్పడి.. రక్తం గుండెకు చేరుకోవడానికి చాలా శ్రమపడాల్సి వస్తుంది. దీని వల్ల రక్తపోటు పెరిగి.. అది గుండెపోటుకు దారితీస్తుంది. అటువంటి పరిస్థితిలో గుండెపోటును ఎలా నివారించాలి.. దానికి ముందు కనిపించే లక్షణాలు ఏమిటీ..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెపోటు సంకేతాలు ఎప్పుడు కనిపిస్తాయి..

గుండెపోటు అకస్మాత్తుగా రాదు.. కానీ దీనికి ముందు మన గుండె చాలా సమస్యలతో సతమతమవుతుంది. ఈ సమస్య ఎప్పుడు బయటపడుతుందో తేలిదు. గుండెపోటుకు ముందు మన శరీరం ప్రమాదానికి సంబంధించిన అనేక సంకేతాలను ఇస్తుంది. ఇటీవల, మహిళలపై ఒక పరిశోధన జరిగింది.. దీని ప్రకారం మన శరీరం గుండెపోటుకు 4 వారాల ముందు ప్రమాద సూచనలను ఇస్తుంది. దాదాపు నెలముందే ప్రారంభమవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

రీసెర్చ్ ఏం చెబుతుంది..

జర్నల్ సర్క్యులేషన్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. గుండెపోటుకు 1 నెల ముందు దాని హెచ్చరికల సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ అధ్యయనం 500 మందికి పైగా మహిళలపై జరిగింది. వారు గుండెపోటు నుంచి సురక్షితంగా బయటపడ్డట్లు పేర్కొంది. 95 శాతం మంది మహిళలు తమ శరీరంలో కొన్ని లక్షణాలు నెల రోజుల క్రితమే కనిపించడం ప్రారంభమయ్యాయని పేర్కొంది. 71 శాతం మంది ప్రజలు అలసిపోయినట్లు భావించగా, 48 శాతం మందికి నిద్రకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అంతే కాకుండా ఛాతీలో ఒత్తిడి, ఛాతీలో నొప్పి వంటి సమస్యలు ఉండేవని వివరించింది.

గుండెపోటు వచ్చే ముందు కనిపించే సంకేతాలు..

మీ శరీరంలో కింది ఏవైనా సమస్యలు ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. ఎందుకంటే ఇది గుండెపోటుకు సంకేతం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

  • గుండెలో దడ – గుండె వేగంగా కొట్టుకోవడం
  • ఆకలి లేకపోవడం
  • చేతులు – కాళ్లు వణకడం, గుంజడం
  • రాత్రిపూట శ్వాస ఆడకపోవడం
  • చేతుల్లో బలహీనత లేదా బరువుగా అనిపించడం
  • అలసట
  • నిద్ర లేకపోవడం
  • అజీర్ణం
  • డిప్రెషన్
  • కంటి చూపు బలహీనపడడం

ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..